Baahubali Movie | Mamta Se Bhari Official Song

Baahubali movie mamta se bhari official song

Baahubali Mamta Se Bhari Official Song, Mamta Se Bhari Official Song, Baahubali movie latest news, Baahubali posters, Baahubali movie updates, Baahubali movie details, Baahubali stills, Baahubali songs, Baahubali trailers, Prabhas, Karan Johar, Bollywood News

Baahubali Movie Mamta Se Bhari Official Song: Baahubali Hindi version Mamta Se Bhari Official Song teaser released. SS Rajamouli Direction. Keeravani music.

సాంగ్ సిరిగిపోయింది.. సివగామి, బాహుబలి కేక!

Posted: 06/19/2015 03:59 PM IST
Baahubali movie mamta se bhari official song

‘బాహుబలి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో జులై 10న భారీ ఎత్తున విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ మొదలుపెట్టేసింది. ఈ ప్రమోషన్ కార్యక్రమాలను హిందీ వర్షెన్ నుంచి ప్రారంభించారు. బాలీవుడ్ లో ‘బాహుబలి’ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

ఇప్పటికే ప్రభాస్, రానా, తమన్నాలు బాలీవుడ్ లో తెగ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లలో పాల్గొంటూ మరింత ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘బాహుబలి’ హిందీ వెర్షన్ కు సంబంధించిన ‘మమత సెబరీ..’ అనే పాట ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మతిపోతుంది. వారెవ్వా... ప్రతి సీన్ కిరాక్. సినిమాపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సాంగ్ ట్రైలర్ తో మరింత పెరిగిపోతున్నాయి.

తెలుగు బాహుబలి ఆడియో వేడుకలో దర్శకుడు రాజమౌళి చెప్పినట్లుగా ఇందులో రమ్యకృష్ణ అద్భుతంగా నటించినట్లుగా అనిపిస్తుంది. సివగామి పాత్రలో రమ్యకృష్ణ లుక్స్ సూపర్బ్. ఇక ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ట్రైలర్ చూస్తేనే ఇలా వుందంటే.. ఇక సినిమా ఎలా వుండబోతుందో ఏమో త్వరలోనే తెలియనుంది.

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Mamta Se Bhari Official Song  Prabhas  Karan Johar  Bollywood News  

Other Articles