Anchor Prasanthi | Affair | First Look Poster | Movie News

Affair movie first look poster released

Affair First Look Poster Released, Affair First Look Poster, Affair First Look, Affair Movie First Look Poster, Anchor Prasanthi latest stills, Anchor Prasanthi movie news, Anchor Prasanthi movie updates, Anchor Prasanthi hot stills, Anchor Prasanthi

Affair Movie First Look Poster Released: Tv Anchor Prashanthi latest film Affair. This Film First look posters released today. Sri Rajan Director.

ప్రశాంతి హాట్ ఎఫైర్ ఫస్ట్ లుక్ విడుదల

Posted: 06/16/2015 03:08 PM IST
Affair movie first look poster released

కొన్ని ఆంగ్ల పదాలు తెలుగులో అలవోకగా కలిసిపోతుంటాయి. అచ్చ తెలుగులో ఆ పదాలకు అర్ధమేంటో చెప్పడం కూడా కష్టమైపోతుంది. తెలుగులో చెప్పినా చాలామందికి అర్ధం కాదు కూడా. వాటిలో ఒకటి ‘ఎఫైర్‌’. ఎలిమెంటరీ స్కూల్‌ మెట్టు కూడా ఎక్కని పక్కా పల్లెటూరి కుర్రాడికి కూడా ‘ఎఫైర్‌’ అంటే ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. దాన్నిబట్టి ‘ఎఫైర్‌’ అన్న పదం పాపులారిటీని మనం అర్ధం చేసుకోవచ్చు. ఇంతటి పాపులారిటీ కలిగిన ఈ పేరుతో ఓ సినిమా తీస్తున్నారు ప్రముఖ నిర్మాత`భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.

శ్రీరాజన్‌ దర్శకత్వం వహిస్తూ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంతి, గీతాంజలి, ధనరాజ్‌, రాకేష్‌, సాయిరాజ్‌, షాని సాల్మోన్‌, పుచ్చా రామకృష్ణ, హరిత, ఫణి, సంపత్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను దర్శకరత్న డా॥దాసరి ఆవిష్కరించి.. చిత్ర యూనిట్‌కు తన ఆశీస్సులు అందించారు. ‘ఎఫైర్‌’ యూనిట్‌ సభ్యులు (నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీరాజన్‌ దర్శకత్వంలో తన శిష్యుడు రామసత్యనారాయణ నిర్మిస్తున్న ‘ఎఫైర్‌’ ఘన విజయం సాధించాలని ఈ సందర్భంగా దాసరి ఆకాంక్షించారు. టీజర్‌ చూస్తుంటే.. డెఫినెట్‌గా హిట్టవ్వడం ఖాయమనిపిస్తోందని దర్శకరత్న అన్నారు. లెజండరీ డైరెక్టర్‌ దర్శకరత్న డా॥దాసరి చేతుల మీదుగా తమ ‘ఎఫైర్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ అవ్వడం పట్ల నిర్మాత రామసత్యనారాయణ, దర్శకుడు శ్రీరాజన్‌ ఆనందం వ్యక్తం చేసారు.

ఈ చిత్రానికి ఎడిటింగ్‌: సోమేశ్శర్‌ పోచం, కెమెరా: కర్ణ ప్యారసాని, డి.ఐ`విజువల్‌ ఎఫెక్ట్స్‌: రఘు (మహానామా), డైలాగ్స్‌: అనిల్‌ సిరిమల్ల, మ్యూజిక్‌: రవివర్మ బళ్ల, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, స్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరాజన్‌!!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Prasanthi  Affair  First Look Poster  Movie News  

Other Articles