Bahubali Movie Audio Songs Leaked | Social Media Networks | Sivuni Aana Song | Rajamouli

Bahubali movie audio songs leaked social media networks

Bahubali Movie Audio Songs Leaked Social Media Networks : Bahubali Movie Audio songs leaked in social media networks before audio release. This is going viral on youtube and social media.

Bahubali Movie Audio Songs Leaked Social Media Networks : Bahubali Movie Audio songs leaked in social media networks before audio release. This is going viral on youtube and social media.

‘బాహుబలి’ని వీడని లీకేజ్.. ‘శివుని’ పాట సంచలనం!

Posted: 06/11/2015 01:26 PM IST
Bahubali movie audio songs leaked social media networks

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని మొదటి నుంచి ‘లీకేజ్’ సమస్య వెంటాడుతూ వస్తోంది. ఆమధ్య షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఓ ఫైట్ సీన్ కి సంబంధించి ఓ వీడియో లీకై సంచలనం సృష్టించింది. అది రెండుమూడు రోజులపాటు సామాజిక మాధ్యమాల్లో బాగానే చక్కర్లు కొట్టింది. అయితే.. యూనిట్ బృందం దానిపై వెంటనే స్పందించడంతో ఆ వివాదం అంతటితో సమసిపోయింది.

ఇప్పుడు తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆడియో సాంగ్ లీకయ్యింది. ఈ మూవీ ఆడియో జూన్ 13న విడుదల కానున్న నేపథ్యంలో ఇలా ఆడియో లీకవ్వడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ‘శివుని ఆన’ పేరిట వున్న ఆ పాట ఇప్పటికే వాట్సాప్ లాంటి ఇన్‌స్టంట్ మెసేజింగ్‍ సర్వీసుల్లో, యూట్యూబ్ లో హల్‌చల్ చేస్తోంది. దాంతోపాటు మిగతా పాటలు కూడా లీకయ్యాయని తెలుస్తోంది. ఆ ఆడియోను విన్నవారు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు. ‘బాహుబలి’ ఇంతకుముందే ఒకసారి లీక్‌‌కు గురవ్వడంతో.. ఆ తర్వాత నుంచి మూవీ టీమ్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోంది. అయినప్పటికీ మరోసారి ఈ మూవీ లీక్ బారిన పడడం ఆసక్తికరంగా మారింది. ఈ యూనిట్ లో వర్క్ చేసిన టెక్నికల్ సభ్యులెవరైనా ఈ ఆడియోని రిలీజ్ చేసి వుంటారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఇప్పటికే ఓసారి వాయిదా పడిన విషయం తెలిసిందే! తాజాగా జూన్ 13న తిరుపతిలో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. కీరవాణి ఆధ్వర్యంలో రూపొందిన ఆడియోతో పాటు మరో కొత్త ట్రైలర్‌ను కూడా అదే రోజు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆడియో లీకవ్వడం శోచనీయం! ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. జూలై 10 తెలుగు, హిందీ, తమిళ, మళయాల భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali movie  rajamouli  prabhas  anushka  

Other Articles