Actress Samantha talks about art films

Actress samantha talks about art films

samantha talks about art films, samantha not encourage art flicks, samantha latest news, samantha movie news, samantha movie updates, samantha latest interview, samantha press meet, samantha latest updates, samantha stills, samantha hot news, samantha

Actress Samantha talks about art films: actress samantha latest comments on art flicks movies. samantha says I can’t encourage art flicks.

ఓ అన్న... సమంతక్క ఏం జెప్పిందో విన్నవా?

Posted: 06/09/2015 01:54 PM IST
Actress samantha talks about art films

సినిమాలు చేస్కుంటు తన గురించి తాను ఆలోచించకుండా.. హీరోయిన్ సమంత జనాల గురించి ఏం ఆలోచన చేస్తుందో చూసిండ్రా? కమర్షియల్ సినిమాలు చేస్తే పైసలొస్తాయి, పదిమంది సల్లంగా వుంటారు... ఈ అవార్డులొస్తే ఏం లాభం. సినిమాలు ఫ్లాపయ్యి, సినిమాలు కొన్నొళ్లకు నష్టాలొచ్చి, ఎన్ని అవార్డులొస్తే మాత్రం ఏం లాభం అని అంటోంది క్యూట్ భామ సమంత. యే.. సమంత చెప్పినదాంట్లో కూడా మస్తుగా నిజముంది కదా! అసలు సమంత ఏం చెప్పిందో మొత్తం చెప్పుమంటరా? సరే సమంత ఏం చెప్పిందో చూద్దాం!

హీరోయిన్లు అందరూ కూడా పైసలు బాగా ఇచ్చే సినిమాలు, లేదా వాళ్లని బాగా అందంగా చూపించే సినిమాలలో నటిస్తుంటూ వుంటారు. ఇలాంటి సినిమాల వల్ల చూసే జనాలకు కూడా మస్తు ఎంటర్ టైన్మెంట్ వుంటుంది. అరే యాక్షన్, ఫైటింగులు, నవ్వులు, ఏడ్పులు, రొమాన్సులు, కిస్సింగులు, హగ్గింగులు, హీరోయిన్ల గరం గరం అందాలు... అబ్బో ఒక్కటేమిటి.. కమర్షియల్ సినిమా అంటే ఇక ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లెక్కన్నమాట.

Samantha talks about art films-02

ఇలాంటి కమర్షియల్ సినిమాల వల్ల చూసే జనాలు ఫుల్ ఖుషీ.. అలాగే సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా మస్తు పైసలు సంపాదించుకుంటారు. కానీ ఈ ఆర్ట్ సినిమాల వల్ల ఏం లాభం. ఇందులో ఎంత బాగా నటించిన కూడా సినిమాలు హిట్టవుతాయనే గ్యారెంటీ లేదయే. ఇక చుసెటోళ్లకు కూడా ఎంటర్ టైన్మెంట్ వుండదాయే. ఏదో పాతకాలం నాటి సినిమాకు కొత్త రంగులేసినట్లుగా ఒకటే బాధకరమైన యాక్టింగ్ లు చూడాలి. ఇక దీనివల్ల జనాలకు బోర్ కలుగుతుంది. సినిమా కొన్నోళ్లకు కూడా పైసలు రావడం కూడా కష్టమే.

కానీ సినిమాలో ఏమైనా కాస్త కథ వుంటే మాత్రం అవార్డులు వస్తాయేమో కానీ.. అయినా జనాలకు కావాలసింది ఎంటర్ టైన్మెంట్.. బయ్యర్లకు కావాల్సింది కాసుల పంట. ఇవి కాకుండా సినిమా మొత్తానికి కలిపి ఓ అవార్డు ఇస్తామంటే వీళ్లందరూ నష్టపోయినట్లే కదా! అందుకే కమర్షియల్ సినిమాలే చేస్తానంటూ సమంత భామ తనదైన శైలిలో చెప్పుకొచ్చింది.

సమంత చెప్పినదాంట్లో మస్తు నిజముంది కదా! తనకు పైసలు రావాలనే కాకుండా ఇటు చూసేటోళ్లకు, అటు సినిమా కొనుక్కునోళ్లు కూడా మస్తు ఖుషీ అవ్వాలని సమంత ఫీల్ అవుతుంది. మొత్తానికి సమంత సినిమాల గురించి బాగానే నేర్చుకున్నది. సమంతకు మరి ఆర్ట్ సినిమాల్లో ఏదైనా పెద్ద డైరెక్టర్ ఆఫర్ ఇస్తే చేస్తుందో లేక చేయదో భవిష్యత్తులో చూడాలి.

Samantha talks about art films-03

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  comments  art flicks  interview  stills  kollywood  

Other Articles