Actress Aarthi Agarwal passed away

Actress aarthi agarwal passed away

Aarthi Agarwal is no more:, Aarthi Agarwal passed away, Aarthi Agarwal died, Aarthi Agarwal dead, Aarthi Agarwal latest news, Aarthi Agarwal news, Aarthi Agarwal movie news, Aarthi Agarwal videos, Aarthi Agarwal songs, Aarthi Agarwal movies, Aarthi Agarwal latest updates, Aarthi Agarwal RIP, Aarthi Agarwal, Aarthi Agarwal stills, Aarthi Agarwal photos, Aarthi Agarwal gallery

Actress Aarthi Agarwal passed away: Tollywood Cine Actress Aarthi Agarwal passed away. Aarthi Agarwal is an actress who primarily acts in Telugu films. She made her Telugu film debut in Nuvvu Naaku Nachav with actor Venkatesh.

తిరిగిరాని లోకాలకు ఆర్తీ అగర్వాల్... వికటించిన లైపో

Posted: 06/06/2015 03:59 PM IST
Actress aarthi agarwal passed away

ప్రముఖ సినీ నటి ఆర్తి అగర్వాల్ హాఠాన్మరణం చెందారు. గతకొద్ది కాలంగా సినీ జీవితానికి దూరంగా వుంటున్న ఆర్తి అగర్వాల్ అనారోగ్యంతో భాధపడుతోంది. ఈ కారణంగా అమెరికాలో చికిత్స పొందుతుంది. అయితే అమెరికాలో లైపో చికిత్స చేయించుకునే సమయంలో లైపో చికిత్స వికటించడంతో ఆర్తి అగర్వాల్ తన తుదిశ్వాస విడిచారు.

తెలుగులో 2001లో విడుదలైన ‘నువ్వునాకు నచ్చావ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మొదటి సినిమానే భారీ హిట్టవ్వడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా స్టార్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

‘నువ్వునాకు నచ్చావ్’ సినిమా తర్వాత ఆర్తీ అగర్వాల్ ‘నువ్వు లేక నేను లేను’, ‘ఇంద్ర’, ‘అల్లరి రాముడు’, ‘పలనాటి బ్రహ్మనాయడు’, ‘వసంతం’, ‘నేనున్నాను’, ‘సంక్రాంతి’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించింది. దాదాపు టాలీవుడ్ లో వున్న అగ్ర, స్టార్ హీరోలందరి సరసన ఆర్తి అగర్వాల్ నటించింది.

అయితే ‘నువ్వులేక నేనులేను’ చిత్ర సమయంలో తన సహనటుడు తరుణ్ తో ప్రేమలో పడిందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత వీరి ప్రేమ బ్రేకప్ అవ్వడంతో అర్తీ అగర్వాల్ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని వార్తలొచ్చాయి. అయితే ఓసారి అనుమానస్పద పరిస్తితుల్లో మెట్లపై నుంచి జారిపడి హాస్పిటల్ పాలయ్యింది. అలాగే మరోసారి ఏవో క్లినింగ్ కెమికల్ తాగి ఆత్మాహత్య ప్రయత్నం చేసింది. అయితే తన సహనటుడితో తనకు సంబంధం వున్నట్లుగా వస్తున్న పుకార్లకు విసుగుచెంది ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లుగా అప్పట్లోనే ఆర్తి చెప్పుకొచ్చింది.

ఈ ఘటన తర్వాత ఆర్తీ అగర్వాల్ మళ్లీ సునీల్ హీరోగా నటించిన ‘అందాలరాముడు’ సినిమాతో హీరోయిన్ గా ఆర్తీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్టయ్యినప్పటికీ... ఆర్తీ తన గ్లామర్ ను పూర్తిగా కోల్పోవడంతో... ఈ సినిమా తర్వాత ఆర్తీకి అన్నీ ఐటెం సాంగ్ అవకాశాలే వచ్చాయి. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.

ఈ ప్రేమ పుకార్లకు స్వస్తి పడ్డాక... 2007 లో నవంబర్ 22న ఆర్య సమాజ్ లో ఉజ్వల్ కుమార్ ను ఆర్తీ పెళ్లి చేసుకుంది. కానీ కొంత కాలం తర్వాత మళ్లీ అతనితో వివాహరద్దు చేసుకున్నట్లుగా తెలిసింది. దీంతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేసింది. ఆర్తీ అగర్వాల్ నటించిన చివరి చిత్రం ‘రణం2’. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

కానీ ఆర్తీ అగర్వాల్ ఇలా హఠాన్మరణం చెందడంతో సినీ ఇండస్ట్రీకి చెందిన వారందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయారు. సినిమాలకు దూరమయ్యాక ఆర్తీ అగర్వాల్ చాలా లావయ్యింది. బరువు చాలా పెరిగిపోయింది. దీంతో లైపో చికిత్స చేయించుకొని, నాజుకుగా మారి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంది. కానీ ఈ లైపో చికిత్స వికటించడంతో ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది.

ఇప్పటి వరకు తన సినిమాలతో అలరించిన ఆర్తీ అగర్వాల్ ఎక్కడున్నా కూడా ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుందాం.

Video source : iDream Music

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aarthi Agarwal  passed away  no more  died  stills  gallery  

Other Articles