Baahubali | Telugu Trailer | Deleted | Youtube

Baahubali telugu trailer deleted from youtube

Baahubali Trailer Deleted from Youtube, Baahubali Trailer Deleted, Baahubali inspired by mahabharata, Baahubali movie news, Baahubali trailer, Baahubali official trailer, Baahubali teaser, Baahubali latest trailers, Baahubali news, Baahubali movie updates, Baahubali stills, Baahubali

Baahubali Telugu Trailer Deleted from Youtube: Director SS Rajamouli latest film Baahubali. Prabhas, anushka, Rana, Tamanna acts in lead roles. MM Keeravani Music. Baahubali the begining telugu trailer video has been removed as a violation of YouTube's policy against spam, scams, and commercially deceptive content.

షాకింగ్ న్యూస్: యూట్యూబ్ నుంచి బాహుబలి వీడియో తొలగించేసారు!

Posted: 06/03/2015 06:06 PM IST
Baahubali telugu trailer deleted from youtube

అభిమానులంతా ‘బాహుబలి’ ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఇంతకాలం ఎదురుచూసారు. కానీ ఇపుడు మాత్రం ‘బాహుబలి’ ట్రైలర్ ఎందుకు విడుదలయ్యిందా అని భాధపడుతున్నారు. ఎందుకు భాధపడుతున్నారో అర్థం కావడం లేదు కదా! ‘బాహుబలి’ తెలుగు ట్రైలర్ ను యూట్యూబ్ నుంచి తొలగించేసారు.

బాహుబలి దెబ్బకు రికార్డులే కాదు.. యూట్యూబ్ ఛానెల్ కూడా తట్టుకోలేకపోతున్నట్లుగా వుంది. అందుకే ‘బాహుబలి’ తెలుగు థియేటర్ ట్రైలర్ ను యూట్యూబ్ ఛానెల్ నుంచి తొలగించారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’.

ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే హిందీ వెర్షన్ ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. కానీ తెలుగు ట్రైలర్ మాత్రం భారీ స్థాయిలో రికార్డులు బద్దలుకొట్టేసింది. యూట్యూబ్ లో ‘బాహుబలి’ తెలుగు ట్రైలర్ కు భారీ హిట్స్ వచ్చాయి. దీంతో యూట్యూబ్ ఛానెల్ వారు ఈ తెలుగు వర్షెన్ ట్రైలర్ ను తొలగించేసారు.

This video has been removed as a violation of YouTube's policy against spam, scams, and commercially deceptive content.

హిందీ వర్షెన్ ట్రైలర్ ను మాత్రం ఇంకా అలాగే వుంచారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రతిష్టాత్మకంగా, అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ ఎత్తున గ్రాండ్ లెవల్లో విడుదల చేయనున్నారు.

తెలుగు వర్షెన్ ట్రైలర్ తొలగించడమైనది కాబట్టి.. మీకోసం హిందీ వర్షెన్ ‘బాహుబలి’ ట్రైలర్ ను అందిస్తున్నాం. చూసి ఆనందించండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Trailer  Deleted  Prabhas  Rajamouli  

Other Articles