Vinavayya Ramayya | release date | trailers

Vinavayya ramayya movie release date

Vinavayya Ramayya movie news, Vinavayya Ramayya movie release date, Vinavayya Ramayya release date, Vinavayya Ramayya news, Vinavayya Ramayya movie updates, Vinavayya Ramayya stills, Vinavayya Ramayya posters, Vinavayya Ramayya audio, Vinavayya Ramayya songs, Vinavayya Ramayya

Vinavayya Ramayya Movie Release Date: Naga Anwesh, Krithika upcoming film Vinavayya Ramayya. This film will be release on 19 june. Anoop Music.

జూన్ 19న వినవయ్యా రామయ్యా విడుదల

Posted: 06/03/2015 09:56 AM IST
Vinavayya ramayya movie release date

సరస్వతి ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తాజా చిత్రం ‘వినవయ్యా రామయ్యా’. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత ‘సింధురపువ్వు’ కృష్ణారెడ్డి అత్యంత భారీ నిర్మాణ విలువలతో నిర్మించారు.

ఇందులో నాగ అన్వేష్, కృతిక హీరోహీరోయిన్లుగా నటించారు. అనూప్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి. ప్రముఖ దర్శకుడు జి.రాంప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

నాగ అన్వేష్, కృతికలు హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న మొదటి చిత్రం ఇదేనైనా.. ఇప్పటికే వీరిద్దరూ పలు చిత్రాల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన పలు ట్రైలర్లు, సాంగ్స్ చూస్తుంటే... వీరి కెమిస్ట్రీ బాగుందని విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vinavayya Ramayya  release date  trailers  songs  

Other Articles