Bajrangi Bhaijaan Movie | First Look Poster | Salman Khan

Bajrangi bhaijaan movie first look poster

Bajrangi Bhaijaan First Look, Bajrangi Bhaijaan First Look Poster, Bajrangi Bhaijaan movie news, Bajrangi Bhaijaan movie updates, Bajrangi Bhaijaan movie stills, Salman khan latest news, Salman khan stills, Salman khan

Bajrangi Bhaijaan Movie First Look Poster: Salman khan upcoming movie Bajrangi Bhaijaan. this movie First Look Poster released. kareena kapoor heroine.

దుమ్మురేపుతున్న భజ్రంగీ భైజాన్ ఫస్ట్ లుక్

Posted: 05/27/2015 03:34 PM IST
Bajrangi bhaijaan movie first look poster

బాలీవుడ్ అగ్ర స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలే కోర్టు కేసు నుంచి కాస్త బయటపడిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు సంతోషంగా వున్నారు. కోర్టు కేసు అనంతరం ఇటీవలే తన చెల్లెలు అర్పిత రిసెప్షన్ పార్టీలో పాల్గొని ఎంజాయ్ చేసాడు సల్మాన్.

సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘భజ్రంగీ భైజాన్’. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలే కోర్టు కేసు నుంచి బయటపడ్డ తర్వాత సల్మాన్ నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. దీంతో ఈ సినిమా ఎలా వుండబోతుందనని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. చిత్ర టైటిల్ కు తగ్గట్లుగానే సల్మాన్ కళ్లల్లో మెరుపు, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సల్మాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Bajrangi Bhaijaan First Look Poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  Bajrangi Bhaijaan  First Look Poster  

Other Articles