Shruti Haasan | Bollywood offer | movie news

Shruti haasan bags another bollywood offer

Shruti Haasan bags another bollywood offer: Star heroine Shruti Haasan bags another hindi film offer. Anand L Rai producer. Imran khan hero.

Shruti Haasan bags another bollywood offer: Star heroine Shruti Haasan bags another hindi film offer. Anand L Rai producer. Imran khan hero.

ఆనంద్ ఆఫర్ కొట్టేసిన శృతిహాసన్

Posted: 05/21/2015 11:36 AM IST
Shruti haasan bags another bollywood offer

ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలలో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా బిజీగా వుంది స్టార్ హీరోయిన్ శృతిహాసన్. ఈ మూడు భాషల వరుస సినిమాలతో శృతిహాసన్ చాలా బిజీగా వుంది. ‘గబ్బర్ సింగ్’ సినిమాతో తన లక్కును పూర్తిగా మార్చేసుకొని, స్టార్ హీరోయిన్ గా మారిపోయింది

ఇటీవలే అక్షయ్ కుమార్ తో కలిసి హిందీలో శృతిహాసన్ నటించిన ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడికి హిందీలో మళ్లీ వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజాగా శృతిహాసన్ కు ఆనంద్ ఎల్.రాయ్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.

తమిళంలో సూపర్ హిట్టయ్యిన ‘కలయన సమయల్ సాధం’ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్.రాయ్ నిర్మించనున్నారు. ఇందులో ఇమ్రాన్ ఖాన్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. అన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

శృతిహాసన్ ప్రస్తుతం తెలుగులో మహేష్ తో కలిసి ‘శ్రీమంతుడు’ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న ‘పులి’ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  Bollywood offer  movie news  

Other Articles