Paritala Sunitha | Balakrishna Lion Film

Paritala sunitha watched nbk lion film

Paritala Sunitha Watched Balakrishna Lion Film, NBK Lion First Day Collections, NBK Lion collections, NBK Lion latest news, NBK Lion movie news, NBK Lion movie updates, NBK Lion movie reports, NBK Lion movie review, NBK Lion movie talk, NBK Lion public talk, NBK Lion

Paritala Sunitha Watched NBK Lion Film: Nandamuri Balakrishna Latest movie Lion. MLA Paritala sunitha watched lion movie in prasad labs. This movie released on 14 May. Trisha, Radhika apte heroines.

లయన్ సినిమాను వీక్షించిన ఎమ్మెల్యే పరిటాల సునీత

Posted: 05/19/2015 04:17 PM IST
Paritala sunitha watched nbk lion film

నందమూరి బాలకృష్ణ నటించిన ‘లయన్’ సినిమా ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. యావరేజ్ టాక్ తో విడుదలై ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తుంది. మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిన ‘లయన్’ చిత్రాన్ని తాజాగా ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో వీక్షించారు.

సినిమా చూసిన అనంతరం ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ... ‘లయన్’ సినిమా చాలా బాగుంది. రెండు పాత్రలలో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సిబిఐ ఆఫీసర్ పాత్రలో చాలా చక్కగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించినందుకు చాలా ఆనందంగా వుంది. బాలకృష్ణగారు మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

రుద్రపాటి రమణారావు నిర్మించిన ఈ చిత్రం ద్వారా సత్యదేవా దర్శకుడిగా పరిచయమయ్యాడు. త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లు. మణిశర్మ సంగీతం అందించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా బి,సి సెంటర్లలో భారీ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య డైలాగులు, ఫైట్లు, డాన్సులకు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paritala Sunitha  Balakrishna  Lion Film  Collections  

Other Articles