Prabhas | Sujeeth | UV creations | Movie news

Prabhas sujeeth movie latest updates

Prabhas Sujeeth movie launch details, Sujeeth to direct Prabhas, Prabhas again in UV creations, Sujeeth again in UV creations, Director Sujeeth movie with Prabhas, Sujeeth Prabhas movie news, Sujeeth Prabhas movie updates, Prabhas latest news, Prabhas movie updates, Prabhas movie stills, Prabhas

Prabhas Sujeeth Movie Latest Updates: UV creations upcoming movie with young rebel star prabhas in sujeeth direction.

వచ్చే నెలలో ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభం

Posted: 05/16/2015 09:56 AM IST
Prabhas sujeeth movie latest updates

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రభాస్ తో ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన UV క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

‘మిర్చి’ తర్వాత సుజిత్ దర్శకత్వంలో ‘రన్ రాజా రన్’ చిత్రం నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దర్శకుడిగా సుజిత్ మంచి పేరును సొంతం చేసుకున్నాడు. ఇటీవలే ప్రభాస్ కు ఓ కథ వినిపించి, గ్రీన్ సిగ్నల్ దక్కించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు వచ్చే నెల సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది.

ఈ సినిమా ద్వారా ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుంది. UV క్రియేషన్స్ బ్యానర్లో ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’ వంటి వరుస మూడు హ్యట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత రూపొందనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘బాహుబలి- ది బిగెనింగ్’ చిత్రం జులై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభాస్, సుజిత్ ప్రాజెక్టు వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Sujeeth  UV creations  Movie news  

Other Articles