Simbu | Hansika | kollywood news

Simbu lost everything in this two years

Simbu says I lost everything, Simbu lost everything, Simbu latest interview, Simbu interview, Simbu latest comments, Simbu latest news, Simbu movie news, Simbu movie updates, Simbu comments on hansika, Simbu

Simbu lost everything in this two years: I lost everything. I lost films, I lost money; it hurts when I go and ask for money from my mother for my daily expenses.

హన్సికతోనే తన జీవితం ఊహించుకున్నాడట

Posted: 05/15/2015 11:39 AM IST
Simbu lost everything in this two years

తమిళ నటుడు శింబు లవర్ బాయ్ గా మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. శింబు నటించిన సినిమాలు హిట్టయిన, ఫ్లాప్ అయినా కూడా శింబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే వుంది. కానీ ప్రస్తుతం తాను చాలా కష్టాల్లో వున్నానంటున్నాడు శింబు. మొన్నటివరకు సంతోషంగా ఎంజాయ్ చేసిన శింబు... ఇపుడు కేవలం ప్రాణం వున్న జీవిలాగా మాత్రమే బ్రతుకుతున్నాడట. శింబుకి తన సినిమాల కంటే ప్రేమ వ్యవహరాల్లోనే ఎక్కువ పేరు, క్రేజు వచ్చింది. ముందు నయనతారతో, ఆ తర్వాత హన్సికతో ప్రేమాయణం కొనసాగించాడు. ఆ తర్వాత ఇద్దరితో విడిపోయాడు శింబు.

అయితే ఇటీవలే ఈ ప్రేమ వ్యవహారం గురించి శింబు మాట్లాడుతూ... నయనతార, హన్సికల గురించి ఏమి చెప్పమంటారు? వాళ్లపై నా ప్రేమ నిజమైనది... అయితే దాన్ని వారు అర్థం చేసుకోకుండా మతం మార్చినంత సులభంగా మారిపోయారు అంటూ శింబు తన మనసులోని ప్రేమను చెప్పుకొచ్చాడు. నయనతారతో ప్రేమాయణం ముగిసిపోయాక శింబు తన సినిమాలలో బిజీ అయ్యాడు. కానీ హన్సికతో ప్రేమ బ్రేకప్ అయ్యాక మాత్రం కోలుకోలేకపోయాడు.

గత ఏడాది శింబు నటించిన రెండు సినిమాలు విడుదలకు నోచుకోలేదు. దీంతో ఖర్చుల కోసం తన ఇంటి నుంచి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతకొద్ది కాలంగా శింబు ప్రేమాయణం, సినిమాల గురించి వస్తున్న వార్తలపై శింబు తాజాగా ఓ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసాడు. బయటకు మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్లుగా సంతోషంగా కనిపిస్తున్న శింబు... ఎంత ఆవేదన చెందుతున్నాడో తానే చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం సినిమాలు, లవర్, మనీ... ఇలా అన్నీ కోల్పోయి బాగా దెబ్బతిని వున్నానని, కనీస ఖర్చుల కోసం కూడా ఇంటి నుంచి డబ్బు తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసాడు. హన్సికతో ప్రేమలో వున్నప్పుడు ఇల్లు, భార్య, పిల్లలు... ఇలా ఎన్నో కలలు కనేవాడినని, కానీ అవన్నీ ఇపుడు తలకిందులయ్యాయని చెప్పుకొచ్చాడు. ఊపిరి మాత్రమే వుంది తప్ప మనిషిగా తాను లేనంటూ శింబు బాధను తెలియజేసాడు. ఇక తనను ఆదరించాల్సిందే అభిమానులేనంటే కోరుకున్నాడు.

హన్సికతో ప్రేమ కాస్త పెళ్లివరకు వెళ్లే సమయంలో బ్రేకప్ అవడం శింబును దారుణంగా దెబ్బతీసినట్లుగా తెలుస్తోంది. హన్సికతో బ్రేకప్ అయ్యాక శింబు మరొకరితో ప్రేమాయణం కొనసాగించలేడు. అలాగే హన్సిక కూడా మరొకరితో ప్రేమలో పడలేదు. కాబట్టి... ఇప్పటికైనా శింబు ప్రేమను అర్థం చేసుకొని హన్సిక మళ్లీ తిరిగి వస్తుందా లేక అలాగే దూరంగా వుంటుందా అనే విషయం త్వరలోనే తెలియనుంది. మరి శింబు మాటలకు హన్సిక ఎలా స్పందించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Simbu  lost everything  Hansika  kollywood news  

Other Articles