Nara Rohit | Asura movie | audio release date

Nara rohith asura movie audio release on 14 may

Asura Movie Audio Release Date, Asura Telugu Movie Teaser, Asura Telugu Movie posters, Nara Rohit Asura movie, Nara Rohit Asura movie news, Nara Rohit Asura stills, Nara Rohit Asura, Nara Rohit latest news, Nara Rohit movie news, Nara Rohit movie updates, Nara Rohit

Nara Rohith Asura Movie Audio Release on 14 May: Nara Rohit upcoming movie Asura. directed by Krishna Vijay, Music composed by Sai Kartheek. Produced by Shyam Devabhaktuni & Krishna Vijay.

మే 14న నారా రోహిత్ అసుర పాటల వేడుక

Posted: 05/12/2015 02:03 PM IST
Nara rohith asura movie audio release on 14 may

నారా రోహిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అసుర’. నారా రోహిత్ సమర్పణలో నిర్మాతలు శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే విడుదల ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో రోహిత్ పవర్ ఫుల్ జైలర్ పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ స్టిల్స్, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల 14న విడుదల చేయనున్నారు.

ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని సమాచారం. గతంలో నారా రోహిత్ నటించిన సినిమాల ఆడియో కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, ఆడియో విడుదల చేసారు. మరి ఈ ‘అసుర’ ఆడియోకు ఆయన రానున్నారో లేదో మరికొద్ది గంటల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Asura movie  audio release date  Teaser  

Other Articles