NTR | Srinidhi | Cancer

Junior ntr going to meet srinidhi

NTR going to meet Srinidhi, NTR latest news, NTR latest updates, NTR stills, NTR news, NTR srinidhi news, NTR updates, NTR

Junior NTR going to meet Srinidhi: Young tiger NTR going to meet Sri Nidhi Who is undergoing for Cancer treatment, Her wish is to meet Tarak.

నేడు శ్రీనిధిని కలవనున్న ఎన్టీఆర్

Posted: 05/12/2015 09:45 AM IST
Junior ntr going to meet srinidhi

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులను ఎంతో ప్రేమిస్తాడనే విషయం అందరికి తెలిసిందే. తన సినిమాకు సంబంధించిన ఏ కార్యక్రమానికైనా వచ్చిన అభిమానులకు ‘జాగ్రత్తగా మీ ఇంటికి చేరుకోండి. మీకోసం మీ ఇంట్లో వాళ్లు ఎదురుచూస్తుంటారు’ అంటూ... అభిమానుల మేలును కోరుకుంటాడు. అలాంటి ఎన్టీఆర్ తన వీరాభిమానిని కలవడానికి సిద్ధమయ్యాడు.

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఎన్టీఆర్ వీరాభిమాని, పదేళ్ల శ్రీనిధి తన అభిమాన నటుడు ఎన్టీఆర్ ను చూడాలని ఆశపడుతుందట. ప్రస్తుతం శ్రీనిధి హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో వున్న రాందేవ్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఈ చిన్నారికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారైనా ఎన్టీఆర్ ను చూడాలని ఆ చిన్నారి ఆశపడుతోంది.

అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ‘మేక్ ఏ విష్’ ఫౌండేషన్ సంస్థ... శ్రీనిధి విషయాన్ని ఎన్టీఆర్ కు తెలిపారు. చిన్నారి కోరికకు స్పందించిన ఎన్టీఆర్ చిరునవ్వుతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీనిధిని కలవడానికి నేడు ఎన్టీఆర్ హాస్పిటల్ కు వెళ్లనున్నాడు. మరికొద్ది గంటల్లో ఎన్టీఆర్ ఆ చిన్నారిని కలవనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Srinidhi  Cancer  meet  

Other Articles