Kangana Ranaut | Movie news | Hot stills

Kangana ranaut latest interview

Kangana Ranaut latest interviews, Kangana Ranaut latest news, Kangana Ranaut movie news, Kangana Ranaut movie updates, Kangana Ranaut stills, Kangana Ranaut hot stills, Kangana Ranaut hot gallery, Kangana Ranaut

Kangana Ranaut latest interview: Bollywood Hot Actress Kangana Ranaut latest news, movies, updates, gossips, rumors, films, photos, stills, gallery.

ఈ హాటు భామను నాశనం చేయాలనుకున్నారట!

Posted: 05/11/2015 11:26 AM IST
Kangana ranaut latest interview

బాలీవుడ్ హాట్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ సినిమా హిట్టవ్వడంతో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ‘క్వీన్’ తర్వాత కంగనా నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా ఘనవిజయం సాధించాయి. దీంతో బాలీవుడ్ లో ఈ అమ్మడు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కానీ కంగనా ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడిందట. ఇపుడంటే క్వీన్ కంగనా అని పిలుస్తున్నారు కానీ.. ఒకప్పుడు ఈ అమ్మడిని ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా తొక్కేయ్యాలని ప్రయత్నించారట. అంతే కాదు.. తనపై చాలా కుట్రలు చేసేవారని కంగనా చెప్పుకొచ్చింది.

తన గత విషయాల గురించి కంగనా చెబుతూ... ఇప్పుడంటే క్వీన్ కంగనా అని ప్రశంసలు కురిపిస్తున్నారు కానీ, సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మాత్రం తనను పలకరించడానికి చాలా మంది ఇష్టపడేవాళ్లు కాదని... ఎందుకంటే తాను ఓ మాములు చిన్న గ్రామం నుంచి వచ్చిన అనే చిన్నచూపుతో చూసేవారని తెలిపింది. తన 17వ ఏటా సినీ ఇండస్ట్రీలోకి వచ్చానని, ఆ సమయంలో చాలా మంది తనను ఎదగనివ్వకుండా తొక్కేయాలనుకున్నారని, అందుకోసం ఎంతో సమయం కూడా కేటాయించి, తనను నాశనం చేయడానికి చాలా డబ్బు కూడా ఖర్చుపెట్టడానికి వెనుకాడలేదని చెప్పుకొచ్చింది.

నిజానికి ఆ వయసులో తన మంచి, చెడుల గురించి తెలిసేది కాదని, తప్పుడు వ్యక్తులకు దూరంగా వుండటానికి తనకు చాలా సమయం పట్టిందని తెలిపింది. కానీ ఒకరి ఎదుగుదలను ఎవరూ ఆపలేరని, ప్రస్తుతం మనుషుల మనస్తత్వాలను, వారితో ఎలా వుండాలో గ్రహించే నేర్పు వచ్చిందని, ఇపుడు తననెవ్వరూ కూడా ఏం చెయ్యలేరని ధైర్యంగా చెబుతోంది కంగానా. ప్రస్తుతం కంగనా నటించిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కంగనా దాదాపు అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా వుంది. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  Movie news  Hot stills  

Other Articles