Dasari Narayana rao | Pawan kalyan | Birthday stills

Dasari talks about pawan kalyan on his birthday

Dasari comments on pawan kalyan on his birthday, Dasari comments on pawan kalyan, Dasari talks about pawan kalyan, Dasari Narayana rao birthday, Dasari Narayana rao birthday special, Dasari Narayana rao latest stills, Dasari Narayana rao latest news, Dasari Narayana rao news

Dasari talks about pawan kalyan on his birthday: Today Director Dasari Narayana rao birthday. dasari talks about his upcoming crazy project with power star pawan kalyan.

అదంతా పవన్ కళ్యాణ్ గొప్పతనం: దాసరి

Posted: 05/04/2015 01:55 PM IST
Dasari talks about pawan kalyan on his birthday

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి, ఎంతోమంది నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఈరోజు ఆయన జన్మదినం. ఈ సంధర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు విశేష్. దాసరి తన పుట్టినరోజు సంధర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ శుభవార్తను అందజేసారు.

దాసరి నారాయణరావు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. అయితే ఈ విషయంపై దాసరి ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ గురించి దాసరి మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ నిజమైన స్టార్ హీరో. తనతో సినిమా చేయాలనుకోవడం తన గొప్పతనం మాత్రమే. తానకు తానే వచ్చి మనమిద్దం కలిసి సినిమా చేయ్యాలి అని అడిగాడు. కానీ నేను మొదట్లో ఏదో సరదాకు చెప్పాడులే అని అనుకున్నాను. కానీ ఈ సినిమా విషయంలో పవన్ మాత్రం చాలా శ్రద్ధ చూపుతున్నాడు అని తెలిపారు.

ఈరోజుల్లో పెద్దవాళ్లకు ఇంత గౌరవం ఇచ్చేవాళ్లు కూడా వున్నారా అని, తన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యమేసిందని అన్నారు. ఇది నిజంగా తన గొప్పతనం మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం కథలు వింటున్నానని, ఈ సినిమాను తాను చెయ్యట్లేదని, కేవలం నిర్మాతగా వుంటానని దాసరి చెప్పుకొచ్చాడు.

దాసరి మాటలకు పవన్ అభిమానులు చాలా సంతోషంగా వున్నాడు. పవన్ అభిమానులు ఏ వ్యక్తిత్వం, నీతి, నిజాయితీ, ధైర్యం, మంచితనం అనే వ్యక్తిగత అంశాలను చూసి పవన్ కళ్యాణ్ మీద అభిమానం పెంచుకున్నారో.. అది వంద శాతం నిజమేనని మరోసారి అగ్ర దర్శకుడు తన నోటి వెంట చెప్పడంతో పవర్ స్టార్ అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందో చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్2’ చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నెల చివర్లో ‘గబ్బర్ సింగ్2’ సెట్స్ పైకి వెళ్లనుంది. శరత్ మరార్ నిర్మించనున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించనున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana rao  Pawan kalyan  Birthday stills  

Other Articles