Manchu Lakshmi | Dongaata | Release Delay | Theatrical Trailer

Manchu lakshmi dongaata movie release on 8 may

Manchu Lakshmi Dongaata Release on 8 May, Manchu Lakshmi Dongaata Release Delay, Manchu Lakshmi Dongaata Theatrical Trailer, Dongaata Theatrical Trailer, Dongaata Movie news, Dongaata movie posters, Dongaata songs, Dongaata audio, Dongaata trailers, Dongaata teasers, Dongaata videos, Dongaata, Manchu Lakshmi latest news, Manchu Lakshmi movie news, Manchu Lakshmi movie updates, Manchu Lakshmi

Manchu Lakshmi Dongaata Movie Release on 8 May: Manchu Lakshmi Dongaata movie release delayed. Vamshi krishna director, Vidyanirvana presents, manchu lakshmi producer.

లయన్ తో ఢీ కొట్టనున్న మంచులక్ష్మీ దొంగాట

Posted: 05/01/2015 03:51 PM IST
Manchu lakshmi dongaata movie release on 8 may

మంచులక్ష్మీ నటించిన ‘దొంగాట’ చిత్రం మే 1న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ అదే రోజున ‘గంగ’, ‘ఉత్తమ విలన్’ వంటి రెండు పెద్ద చిత్రాలు విడుదల అవుతుండటంతో ‘దొంగాట’ చిత్ర విడుదలను వాయిదా వేసారు.

అయితే మే 1న సాయంత్రం ఫస్ట్ షోకు ‘దొంగాట’ విడుదల కాబోతుందని మళ్లీ వార్తలొస్తున్నాయి. ఈ వార్తలపై ‘దొంగాట’ చిత్ర యూనిట్ స్పందించారు. ‘దొంగాట’ చిత్రాన్ని మే 8న విడుదల చేయబోతున్నట్లుగా స్పష్టం చేసారు. కానీ కొన్ని గంటల ముందు మంచు లక్ష్మీ తన సోషల్ మీడియాలో ‘దొంగాట’ చిత్రాన్ని మధ్యాహ్నం ఆట నుంచి ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రకటించారు.

ఆ తర్వాత ‘దొంగాట’ టీం మళ్లీ ఈ చిత్రాన్ని మే 8కి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. మొత్తానికి ‘దొంగాట’ చిత్రాన్ని మే 8కి వాయిదా వేసేసారు. కానీ ప్రస్తుతం మంచు లక్ష్మీ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్నట్లుగా తయారయ్యింది.

‘గంగ’, ‘ఉత్తమ విలన్’ చిత్రాలతో పోటీ ఎందుకులే అని అనుకొని మే8 కి ‘దొంగాట’ చిత్రాన్ని వాయిదా వేసారు. కానీ మే 8న నందమూరి బాలకృష్ణ నటించిన ‘లయన్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. మరి బాలయ్య ‘లయన్’తో మంచు లక్ష్మీ ‘దొంగాట’ ఎలా ఎదుర్కోనుందో చూడాలి.

విద్యానిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై మంచులక్ష్మీ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం ద్వారా వంశీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో మంచులక్ష్మీ, అడవి శేష్, మధు, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించారు. బ్రహ్మానందం, రానా కీలక పాత్రలలో నటించారు.

ఇటీవలే విడుదలైన పాటలకు, టీజర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మంచు లక్ష్మీ పాడిన ‘యాందిరో...’ అనే పాటకు ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాలో రానా స్పెషల్ గెస్ట్ రోల్ లో నటించాడు. ఇక ఈ సినిమాలోని ‘బ్రేకప్...’ సాంగ్ లో నాగార్జున, రవితేజ, మనోజ్, రానా, శింబు, నాని, సుధీర్ బాబు, సుశాంత్, నవదీప్ లు స్పెషల్ డాన్స్ చేసారు. ఈ చిత్రం విడుదల గురించి త్వరలోనే చిత్ర యూనిట్ ఓ అధికారిక ప్రెస్ నోట్ ను విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi  Dongaata  Release Delay  Theatrical Trailer  

Other Articles