Uttama Villain | Release Delay | Movie news

Kamal haasan uttama villain release delayed

Uttama Villain delay, Uttama Villain latest news, Uttama Villain movie updates, Uttama Villain release date, Uttama Villain again delay, Uttama Villain news, Uttama Villain details, Uttama Villain shows, Uttama Villain

Uttama Villain release delayed: The early morning shows of Kamal Haasan-starrer 'Uttama Villain movie release delayed.

కమల్ ఉత్తమ విలన్ వల్ల భారీగా నష్టపోయిన వారి జాబితా

Posted: 05/01/2015 01:06 PM IST
Kamal haasan uttama villain release delayed

ఉలగనాయనన్ గా పేరు సంపాదించుకున్న కమల్ హాసన్.... తన అభిమానులను భారీగా నిరాశ పరిచాడు. అసలు విషయం ఏమిటంటే... కమల్ హాసన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఉత్తమ విలన్’. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 1న ఘనంగా విడుదల చేస్తున్నట్లుగా గతకొద్ది రోజులుగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

దీంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా టికెట్లు దొరుకుతాయో లేదోననే వుద్దేశ్యంతో చాలా మంది ఆన్ లైన్ వారం రోజుల ముందుగానే బుకింగ్ లు చేసుకున్నారు. ఆన్ లైన్ బుకింగ్ లో ‘ఉత్తమ విలన్’ రికార్డు కూడా క్రియేట్ చేసింది. దాదాపు 9 వేలకు పైగా ఆన్ లైన్ టికెట్లు బుక్ అయినట్లుగా తెలిసింది.

అయితే అన్ని వేల మంది టికెట్లు పట్టుకొని, ‘ఉత్తమ విలన్’ సినిమా కోసం థియేటర్ వద్ద ఎదురు చూస్తూ వుంటే... సినిమాను విడుదల చేయకుండా ఆపేసారు. సినిమాకు ఫైనాన్సియల్ సమస్యలు వుండటం వల్ల సినిమాను ఈరోజు (మే1) విడుదల చేయకుండా నిలిపివేసారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా విడుదల తేదికి ముందురోజు వరకు చూస్కోవాలి కానీ.. ఇలా విడుదల తేది రోజున సినిమాను ఆపివేయడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

కేవలం ‘ఉత్తమ విలన్’ సినిమా టికెట్లు కొనుకున్న ప్రేక్షకులే కాకుండా... ఈ సినిమా మే 1న విడుదలవుతుందనే వుద్దేశ్యంతో చాలా సినిమాలు తమ సినిమాల విడుదలతేదిని వాయిదా వేసుకున్నాయి. ‘లయన్’, ‘దొంగాట’, ‘జాదుగాడు’ వంటి పెద్ద, చిన్న చిత్రాలు సైతం వెనక్కి తగ్గాయి. ఒక్కసారిగా ‘ఉత్తమ విలన్’ విడుదలను ఆపివేయడంతో ఇతర చిత్రాల వారు కూడా కాస్త నిరాశ చెందారు.

ఒకవేళ ‘ఉత్తమ విలన్’ చిత్రం మరో కొత్త డేట్ తో విడుదల తేదిని ప్రకటిస్తే.. ఈ ఇతర చిత్రాల విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఉత్తమ విలన్’ చిత్రంతో పాటుగా నేడు(మే1) రాఘవ లారెన్స్ ‘గంగ’ చిత్రం కూడా విడుదల అవ్వాల్సి వుంది. కానీ ఈ చిత్రం కూడా నేడు ఫైనాన్సియల్ సమస్యల వల్ల కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యింది. మరి ‘ఉత్తమ విలన్’ చిత్రం ఎప్పుడూ విడుదలవుతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Uttama Villain  Release Delay  Movie news  

Other Articles