Raghava Lawrence | Ganga | Promotional song | Tapsee

Promotional song for lawrence ganga movie

Promotional song for Raghava Lawrence Ganga, Ganga Theatrical Trailer, Ganga Movie Latest Stills, Ganga Movie Second look stills, Ganga first look, Ganga movie updates, Ganga movie news, raghava lawrence news, raghava lawrence Ganga, Ganga movie trailer, Ganga movie photos, Ganga first look photos, tapsee pannu, tapsee pannu news, tapsee pannu Ganga, nitya menon news, nitya menon Ganga

Promotional song for Lawrence Ganga Movie: Raghava Lawrence Latest movie Ganga. Tapsee, nitya menon heroine. Thaman music. Ganga movie will be release on 1 may.

పనుందని తాప్సీని మళ్లీ పిలిచాడట!

Posted: 04/27/2015 05:30 PM IST
Promotional song for lawrence ganga movie

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గంగ’. లారెన్స్, తాప్సీ జంటగా నటించారు. నిత్యామీనన్ ఓ కీలక పాత్రలో నటించారు. తమిళంలో ‘కాంచన2’ గా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిట్ టాక్ తో భారీ కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ చిత్రాన్ని మే 1న తెలుగులో విడుదల చేయనున్నారు. తెలుగులో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం దర్శకుడు లారెన్స్ ఓ ప్రమోషనల్ సాంగ్ ను ఏర్పాటుచేస్తున్నాడట.

ఈ విషయాన్ని స్వయంగా తాప్సీ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ‘గంగ’ సినిమా కోసం నేను చేయాల్సిన స్ట్రగుల్ అయిపోయిందని భావించాను, కానీ మాస్టర్ ఒక ప్రమోషనల్ సాంగ్ చేయాలని అన్నారు. నాకు ఈ సినిమాలో ఓ డాన్సింగ్ నెంబర్ మిస్ అయ్యిందనే కారణంతోనే ఇలా ప్లాన్ చేసుంటారని’ చెప్పుకొచ్చింది.

త్వరలోనే ఈ సాంగ్ షూట్ చేసి విడుదల చేయనున్నారు. మరి ఈ ప్రమోషనల్ సాంగ్ సినిమాకు ఎలా ప్లస్ అవనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. ఆత్మకు, ప్రేతాత్మకు మధ్య యుద్ధం అనే అంశంతో ‘గంగ’ చిత్రం తెరకెక్కినట్లుగా అనిపిస్తోంది. ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ తో రూపొందినట్లుగా కనబడుతోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

సన్ పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ మీకోసం అందిస్తున్నాం చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghava Lawrence  Ganga  Promotional song  Tapsee  

Other Articles