Mahesh babu donates one and half crores to Children heal child organization

Mahesh babu donates one and half crores heal child organization

mahesh babu, mahesh babu updates, mahesh babu news, mahesh babu gallery, mahesh babu heal child, heal child organization, childrens organizations, social organizations, poor children, mahesh babu controversy

Mahesh babu donates one and half crores heal child organization : Tollywood prince mahesh babu donates ond and half crore rupees to heal child organization which is helping poor children.

మానవత్వానికి స్ఫూర్తిగా నిలిచిన మనసున్న మారాజు

Posted: 04/22/2015 03:53 PM IST
Mahesh babu donates one and half crores heal child organization

డబ్బులకోసం ఒకరినొకరు కొట్టుకునే ఈ రోజుల్లో ‘మానవత్వం’ అన్న పదానికి విలువే లేకుండా పోయింది. ఆపదలో వున్నవాడికి ఆపన్నహస్తం ఇవ్వాల్సిన సాటి మనిషి అపహాస్యం చేస్తున్నాడు. అంతెందుకు.. సొంత ఇంటివారినే డబ్బులకోసం నానాకష్టాలకు గురిచేసి, ఇంటినుంచే గెంటేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు విశ్వవ్యాప్తంగా కోకొల్లలు నమోదు చేసుకున్నాయి.

‘మానవత్వం’ మనిషి ప్రాథమిక హక్కు అని ఓ మహానుభావుడి పేర్కొన్న పదాలు నేడు పాఠాల్లో చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే.. మనుషుల స్వభావం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే.. డబ్బుల వ్యామోహంలో పడి భ్రష్టుపట్టిన ఈ సమాజంలో మానవత్వంతో వ్యవహరించే గొప్ప వ్యక్తులు వున్నారంటే నిజంగా విశేషం! అలాంటివారిలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుని ఒకరిగా పేర్కొనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినీ ఇండస్ట్రీలో ‘ప్రిన్స్’గా గుర్తింపుపొందిన మహేష్ బాబు.. నిజజీవితంలోనూ మనసున్న మారాజుగా పేరుగాంచాడు. పిల్లల సమస్యలకి అండగా నిలుస్తూ నలుగురికీ స్ఫూర్తిగా నిలిచాడు.

వివరాల్లోకి వెళ్తే.. ‘హీల్ చైల్డ్’ అనే ఆర్గనైజేషన్ కి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. పిల్లల సమస్యలకి అండగా నిలిచిన ఈయన.. ఆ సంస్థకి తన సంపాదనలో 30 శాతం కేటాయిస్తుంటాడు. అంతేకాదు.. తాజాగా ప్రిన్స్ ఆ సంస్థకి ‘కోటిన్నర’ రూపాయిలు విరాళం ప్రకటించి, అందరినీ అదే తావులో నడిపించేలా ఆదర్శంగా నిలిచాడు. ఇంత చాలా మొత్తాన్ని ఇలా పిల్లలకోసం విరాళంగా ఇవ్వడాన్ని చూస్తుంటే.. మహేష్ మంచి మనసుకు నిదర్శనంగా నిలిచాడని అందరూ చెప్పుకుంటున్నారు. నిన్నటివరకు మంచి నటుడిగా పేరుగాంచిన ఈ హీరో.. ఇప్పుడు మనసున్న మారాజుగా మారాడని ఇతనిని ప్రశంసిస్తున్నారు.

మహేష్ ఏ విధంగా ఓ సంస్థకి తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఇవ్వడంతోపాటు కోటిన్నర విరాళంగా ఇచ్చి స్ఫూర్తిగా నిలిచాడో.. అదేవిధంగా ఇతర తారలు ముందుకొస్తే సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చునని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : heal child organization  Mahesh babu  Poor children  Tollywood  

Other Articles