naga chaitanya special press meet | dochey movie promotional events | Kriti Sanon

Naga chaitanya special press meet dochey movie promotional events

naga chaitanya news, naga chaitanya dochey movie, dohchay movie news, dochey movie updates, dochey movie gallery, dochey movie review, dochey review, dochey telugu review, dochey crew and cast, kriti sanon news, bvsn prasad, telugu news

naga chaitanya special press meet dochey movie promotional events : naga chaitanya told that his latest flick dochey will definitely entertain telugu audiens. It has a very good story and thrilling point from which audiens can get full enjoyment after watching this movie.

ప్రేక్షకుల హృదయాలను ‘దోచేస్తా’నంటున్న చైతూ

Posted: 04/22/2015 11:19 AM IST
Naga chaitanya special press meet dochey movie promotional events

ఇటీవలే ‘ఒకలైలా కోసం’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న నాగచైతన్య.. తన తదుపరి సినిమా ‘దోచేయ్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘స్వామి రారా’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో చైతూ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఏ విధంగా అయితే దర్శకుడు ‘స్వామి రారా’ చిత్రంలో ఓ బంగారపు గణేశుడి విగ్రహంతో కథను థ్రిల్లింగ్ గా తీశాడో.. అదే విధంగా ‘దోచెయ్యడం’ అన్న కాన్సెప్ట్ తో అంతే థ్రిల్లింగ్ గా ఈ మూవీని రూపొందించినట్లు సమాచారం! ఈ రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ థ్రిల్లింగ్ మూవీ ఈనెల 24వ తేదీన విడుదల రెడీగా వుంది.

ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఫుల్ బిజీగా వున్న చైతూ.. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. ‘దోచేయ్’ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని తెలిపాడు. కథలో ఎంటర్టైన్మెంట్ కి ఏమాత్రం కొదవలేదని, ముఖ్యంగా ఛేజింగ్ సన్నివేశాలు హాలీవుడ్ స్టైల్ లో వుంటాయని తెలిపాడు. కామెడీతోపాటు థ్రిల్లింగ్ సీన్లను దర్శకుడు చాలా చక్కగా ఇందులో రూపొందించాడని అతడు తెలిపాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన కృతి సనన్ మంచి కో స్టార్ అని కితాబిచ్చాడు. ఈ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని, ప్రేక్షకులకు సినిమాని ఆదరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

ఇక ఈ చిత్రానికి సన్నీ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాపై.. అటు చైతూతోపాటు కృతి కూడా ఎన్నో హోప్స్ పెట్టుకుంది. ఈ మూవీ విజయం సాధిస్తే తనకు తెలుగులో మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం వుందని ఆమె ఎంతో నమ్మకంతో వుంది. మరి.. ఈ మూవీని తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వెయిట్ చేయాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  kriti sanon  dochey movie  telugu news  

Other Articles