Kajal Aggarwal Fire About Her Marriage News | Tollywood Unmarried Heroines

Kajal aggarwal marriage issue anushka shetty nayanatara controversies

kajal aggarwal news, kajal aggarwal marriage, kajal aggarwal controversy, kajal aggarwal hot photo shoot, kajal aggarwal gallery, kajal aggarwal love affairs, kajal aggarwal affairs, kajal aggarwal scandals, kajal aggarwal bikini photos, anushka shetty, nayanatara

kajal aggarwal marriage issue anushka shetty nayanatara controversies : Kajal aggarwal denies her marriage rumous another time. She told that the person who she looking for is not come in her life yet.

పెళ్లి ముచ్చట్లలో కాజల్ ‘చురక’.. మూడుపదుల భామలపై ‘నోటివాటం’!

Posted: 04/22/2015 10:46 AM IST
Kajal aggarwal marriage issue anushka shetty nayanatara controversies

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన కాజల్ అగర్వాల్ కి.. ఇటీవలే ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. తమిళంలో ఒకటీఅరా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడికి తెలుగులో ఒక్కటంటే ఒక్క ఆఫర్ లేదు. ఇక బాలీవుడ్ లో ఓ రొమాంటిక్ మూవీలో నటిస్తోంది. అంతే! ఇంతకుమించి ఈమెకు ఏ అవకాశాలు లేవు. ఇలా ఒక్కసారిగా ఆఫర్లు తగ్గిన నేపథ్యంలోనే ఈ భామపై కొన్ని పుకార్లు వెల్లువెత్తాయి. త్వరలోనే పెళ్లి చేసుకుని ఇక లైఫ్ లో సెటిలైపోతుందని, అందుకే అవకాశాలు వరుసగా ఒప్పుకోవడం లేదన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఈ వార్తలు అలా ఇలా చక్కర్లు కొడుతూ చివరకు కాజల్ చెవిన పడ్డాయి. అంతే! ఈ అమ్మడి ఆవేశానికి హద్దుల్లేకుండా పోయాయి. ఓవైపు సినిమాలు లేక తాను సతమతమవుతుంటే.. ఇంతలోనే ఈ పెళ్లి వార్తలెంటంటూ ఆమె కోపం వ్యక్తం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ క్రమంలోనే తన పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై నేరుగా ఖండించింది కూడా! అసలు పెళ్లి చేసుకునే ఆలోచన తనకు ఇప్పుడిప్పుడే లేదని, తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనంటూ వాటిని ఖండించింది. అంతేకాదు.. ఈ విషయంపై సీనియర్ తారల పేర్లు ప్రస్తావించి తన నోటివాటం ప్రదర్శించింది.

‘అనుష్క, నయనతార, ఇంకా ఇతర హీరోయిన్లు నాకంటే పెద్దవాళ్లున్నారు. వాళ్లే ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. అలాంటప్పుడు నాకు పెళ్లేమిటి? వీళ్లు చేసుకున్న తర్వాతే నేనూ చేసుకుంటాను. అదీగాక ఇంతవరకు నాకు తగిన కుర్రాడు ఇంకా తారసపడలేదు. ఆ సమయం వస్తే నేనే నా పెళ్లి గురించి వెల్లడిస్తా. అయినా.. నాకు లేని తొందర మీకెందుకండీ?’ అంటూ చురకేస్తోంది కాజల్ అగర్వాల్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal aggarwal  Anushka Shetty  Nayanatara  Tollywood Heroines  

Other Articles