Paruchuri Venkateshwara rao | megastar Chiranjeevi | Uyyalavada narasimha reddy

Paruchuri venkateshwara rao talks about uyyalavada narasimha reddy

Paruchuri Venkateshwara rao comments on Chiranjeevi, Paruchuri comments on Chiranjeevi, Paruchuri Venkateshwara rao, uyyalavada narasimhareddy, chiranjeevi movie news, Paruchuri Venkateshwara rao comments

Paruchuri Venkateshwara rao talks about Uyyalavada narasimha reddy: Telugu cine writer Paruchuri Venkateshwara rao latest comments on his upcoming project Uyyalavada narasimha reddy for megastar Chiranjeevi.

మెగాస్టార్ కోసం నరసింహారెడ్డి ఎదురుచూపులు

Posted: 03/26/2015 11:44 AM IST
Paruchuri venkateshwara rao talks about uyyalavada narasimha reddy

‘మగధీర’ సినిమాలో స్పెషల్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచిన మెగాస్టార్ చిరంజీవి వెండితెరకు దూరమయ్యారు. చిరంజీవి ఇప్పటివరకు 149 చిత్రాల్లో నటించారు. 150వ చిత్రం ఎప్పుడు చేస్తాడో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత రెండు, మూడెళ్లుగా చిరంజీవి 150వ సినిమా గురించే రకరకాల వార్తలొస్తున్నాయి.

చిరంజీవి నటించబోయే చిత్రానికి రకరకాల దర్శకుల పేర్లు వినిపించాయి. వి.వి.వినాయక్ నుంచి కొత్త దర్శకుల వరకు కూడా పేర్లు వినిపించాయి. కానీ ఎవరూ కూడా ఖరారు కాలేదు. ఇంకా మంచి స్ర్కిప్టు కోసం చరణ్ వెతుకుతూనే వున్నాడట. ఎందుకంటే తన తండ్రి చిరంజీవి నటించబోయే 150వ చిత్రానికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

అయితే చిరంజీవి 150వ చిత్రానికి తన దగ్గర కథ సిద్ధంగా వుందని గతకొద్ది రోజులుగా ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు చెబుతూ వస్తున్నారు. ఆ కథకు ‘ఉయ్యాలవాడ నరసింహరెడ్డి’గా టైటిల్ కూడా ఖరారు చేసారు. అయితే చరణ్ మరి ఈ కథ విన్నాడో లేదో తెలియదు కానీ... వెంకటేశ్వరరావు కథకు మాత్రం మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే లేదు.

తాజాగా ఈ విషయంపై పరుచూరి వెంకటేశ్వరరావు ఓ పెద్ద కామెంట్ చేసాడు. అదెంటంటే... శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఉంటారో సీనియర్ ఎన్.టి.ఆర్ వేషం వేస్తె మనకు తెలిసింది, భక్త కన్నప్ప ఎలా ఉంటాడో కృష్ణంరాజు వేషం వేస్తె తెలిసింది. అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడో సూపర్ స్టార్ కృష్ణ వేషం వేస్తే తెలిసింది. అలాగే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎలా ఉంటాడనేది చిరంజీవి గారు చేస్తేనే తెలుస్తుందని’ పరుచూరి వెంకటేశ్వరరావు అన్నాడు.

మరి ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఈ ప్రాజెక్టుకు మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే.. ఈ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’గా ఎవరూ నటిస్తారో భవిష్యత్తులో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paruchuri Venkateshwara rao  comments  Chiranjeevi  Uyyalavada narasimha reddy  

Other Articles