Nagarjuna latest statement on kannada mythri movie screening telugu remake

nagarjuna news, akkineni nagarjuna news, nagarjuna latest updates, nagarjuna mythri remake, mythri telugu remake, kannada mythri movie, mythri kannada movie, kannada movies, nagarjuna mythri movie news

nagarjuna latest statement on kannada mythri movie screening telugu remake : Akkineni nagarjuna has given confusion statement on kannada mythri movie telugu remake after watching special screening of that movie.

డైలమాలో పడేసిన నాగార్జున

Posted: 03/17/2015 03:29 PM IST
Nagarjuna latest statement on kannada mythri movie screening telugu remake

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున తన తాజా స్టేట్ మెంట్ ద్వారా సినీ ఇండస్ట్రీతోపాటు అభిమానుల్ని డైలమాలో పడేశాడు. ఓ సినిమా విషయమై వచ్చిన రూమర్ల మీద స్పందించిన ఈ హీరో.. కాస్త తికమక సమాధానమే ఇచ్చి ఇరకాటంలో పెట్టేశాడు. పూర్తి విశ్లేషణ లేకుండా అతను చెప్పిన సమాధానానికి సినీ నిర్మాతలు సైతం ఆలోచనల్లో పడిపోయారు. అసలు.. ఇంతకీ నాగ్ ఏం స్టేట్ మెంట్ ఇచ్చాడు..? అనేగా సందేహం! అది తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

పునీత్ రాజ్ కుమార్, మోహన్ లాల్ హీరోలుగా కలిసి నటించిన మల్టీస్టారర్ ‘మైత్రి’ మూవీ కన్నడలో భారీ విజయం సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ రీమేక్ చేయాలని నిర్మాత ఎన్ఎస్ రాజ్ కుమార్ భావించారు. తెలుగు రీమేక్ లో మూవీలో నాగార్జునను హీరోగా తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నిర్మాత ఆయన్ను సంప్రదించారు. అలాగే.. నాగ్ కోసం ప్రత్యేకంగా ఈ మూవీ స్ర్కీనింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం నాగార్జున తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘మైత్రి’ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యానని పేర్కొన్న నాగ్.. అసలు ఆ మూవీ చేస్తాడా..? లేదా..? అన్నది క్లారిటీగా చెప్పలేదు.

ఆ మూవీపై నాగ్ అభిప్రాయం తెలుపుతూ.. ‘మైత్రి సినిమా చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే.. ఈ చిత్రం కుటుంబ విలువలతోపాటు సమాజానికి ఓ సందేశాన్ని అందించే విధంగా వుంది. ఈ మూవీ నాకు చేయాలనే వుంది కానీ.. ఇంకా దీనిపై తుదినిర్ణయం తీసుకోలేదు’ అంటూ నాగ్ వెల్లడించాడు. దీంతో.. ఇంతకీ నాగార్జున ఈ చిత్రం చేస్తాడా..? లేదా..? అన్న డైలమాలో అటు నిర్మాతతోపాటు ఇండస్ట్రీవర్గాలు, అభిమానులు సందేహంలో మునిగిపోయారు. దీనిపై క్లారిటీ రావాలంటే.. మరికొన్నాళ్లపాటు ఆగాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni nagarjuna  kannada mythri movie  puneet rajkumar  mohanlal  

Other Articles