Sana khan horror movie aftab shivdasani bollywood news

sana khan news, sana khan latest news, sana khan latest updates, sana khan photo shoot, sana khan hot photo shoot, sana khan stills, sana khan images, sana khan pics, sana khan interview, sana khan controversies, sana khan love affairs, sana khan scandals, sana khan horror movie, sana khan horror flick, aftab shivdasani

sana khan horror movie aftab shivdasani bollywood news : After a long time actress sana khan got a chance in bollywood horror movie in which she is pairing with aftab shivdasani

‘దెయ్యమై వస్తున్నానమ్మో’ అంటున్న సనా..

Posted: 03/11/2015 07:01 PM IST
Sana khan horror movie aftab shivdasani bollywood news

‘గగనం’, ‘మిస్టర్ నూకయ్యా’, ‘కత్తి’ వంటి సినిమాల్లో నటించిన సనాఖాన్.. ఆ మూవీలు అంతగా విజయం సాధించకపోవడంతో ఈమెకు ఆఫర్లు రాలేదు. దీంతో అరకొర సినిమాలు చేసుకుంటూ కాలం గడిపింది. అయితే.. హిందీ పరిశ్రమలో ఆఫర్లు సాధిస్తే తనకు క్రేజ్ బాగా వస్తుందన్న నమ్మకంతో ఈమె గతకొంతకాలంగా బాలీవుడ్ పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పాల్గొంది. ఆ షో ద్వారా మంచి పేరు సాధించిన ఈ నటికి సల్మాన్ నటించిన ‘జై హో’ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించే ఆఫర్ దక్కింది. దాంతో బాలీవుడ్ లో ఈమెకు కాస్త గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడికి ఓ సినిమాలో కథానాయికగా నటించే ఛాన్స్ వచ్చింది.

నటుడు అఫ్తాబ్ శివదసాని హీరోగా హిందీలో ఓ హారర్ చిత్రం రూపొందనుంది. ఈ దెయ్యాల చిత్రంలోనే అమ్మడికి హీరోయిన్ గా నటించే ఛాన్స్ వరించింది. ఇందులో వీరిమధ్య కొన్ని ఘాటు సన్నివేశాలు కూడా వుంటాయని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రేమికుల మధ్య ఓ దెయ్యం ఎంట్రీ అయితే వాళ్లు పడే పాట్లు, సమస్యలు ఏంటనే కథానేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని బాలీవుడ్ సమాచారం! ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా వెలువడి కావాల్సి వుంది.

ఇదిలావుండగా.. చాలాకాలం వేచిచూసిన తర్వాత తనకు ఈ హారర్ చిత్రంలో కథానాయికగా నటించే ఆఫర్ వచ్చినందుకు సనా ఖాన్ ఆనందం వ్యక్తం చేస్తోంది. తన నిరీక్షణ ఇప్పుడు ఫలించిందని చెబుతున్న ఈ అమ్మడు.. ఈ సినిమాలో బాగా నటించగలనన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. అంతేకాదు.. ఈ మూవీతో తన సినీకెరీర్ మరింత మెరుగుపడుతుందని అమ్మడు భావిస్తోంది. మరి.. ఈ హారర్ చిత్రం ఆమె సినీకెరీర్ లో వెలుగులు నింపుతుందా..? లేదా చీకటిలోకి తీసుకెళుతుందా..? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sana khan  bollywood horror movie  aftab shivdasani  

Other Articles