Manchu vishnu as dynamite

manchu vishnu as dynamite, hero manchu vishnu upcomming movie dynamite, manchu vishnu devakatta titled as dynamite, manchu vishnu, manchu vishnu latest news, manchu vishnu movies, manchu vishnu photos, manchu vishnu movie collections, manchu vishnu latest updates, manchu vishnu movie news, manchu vishnu cinema News, manchu vishnu upcomming movies, manchu vishnu dynamite stills, manchu vishnu dynamite songs, manchu vishnu dynamite movie news

hero manchu vishnu upcomming movie with devakatta titled as dynamite

డైనమైట్ గా వస్తున్న మంచువిష్ణు..

Posted: 03/01/2015 04:17 PM IST
Manchu vishnu as dynamite

హీరో మంచు విష్ణు తదుపరి చిత్రానికి పేరు ఖరారైంది. వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలతో విభిన్న చిత్రాలతో అటు తెలుగు ప్రేక్షకుల మన్నలను అందుకోవడంతో పాటు ఇటు సినీ విమర్శకుల మెప్పు పొందిన డైరెక్టర్ దేవకట్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి డైనమైట్ అన్న పేరును ఖరారు చేసినట్లు సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ని ఈ చిత్ర టీం అనౌన్స్ చేసింది. ఈ సినిమా కాన్సెప్ట్ తో పాటు, మంచు విష్ణు లుక్ కి సరిపోయేలా ‘డైనమైట్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.

ఈ సినిమాలో మంచు విష్ణు టోటల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా ప్రణిత నటిస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్. మంచు మోహన్‌బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu vishnu  devakatta  dynamite  

Other Articles

Today on Telugu Wishesh