Sundeep kishan tiger movie release on ugadi

Sundeep kishan Tiger Movie Release on Ugadi, Tiger Movie on Ugadi, Tiger Movie Release on march 21, Tiger Movie news, Tiger Movie release date, Tiger Movie stills, Tiger Movie details, Tiger Movie trailer, Tiger Movie teaser, Tiger Movie posters, Sundeep kishan Tiger Movie

Sundeep kishan Tiger Movie Release on Ugadi: Sundeep kishan Upcoming movie Tiger. Audio launched on feb 17th. seerath kapoor heroine. Thaman music. movie release on march 21st.

ఉగాది కానుకగా సందీప్ టైగర్ విడుదల

Posted: 02/25/2015 09:50 AM IST
Sundeep kishan tiger movie release on ugadi

సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్’. కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. కాశీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో సందీప్ కిషన్ చాలా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా తనకు కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో వున్నాడు సందీప్ కిషన్.

ఇందులో సందీప్ కిషన్ కేవలం ఇంటర్వెల్ కు 10 నిమిషాల ముందే ఎంట్రీ ఇస్తారని తెలిసింది. తన స్నేహితుడి కోసం కుదిరితే ప్రాణాలు ఇవ్వడానికైనా లేదంటే ప్రాణాలు తీయడానికైనా సిద్ధమే అనే విధంగా సందీప్ పాత్ర వుంటుందని తెలిసింది. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 21న విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sundeep Kishan  Tiger  Movie  release  Ugadi  Telugu  news  

Other Articles