Krish varun tej movie launch on feb 27th

Krish Varun Tej movie launch on feb 27th, Varun Tej new movie under Krish Direction, Varun Tej under Krish direction, varun tej next movie in krrish direction, varun tej next movie with krrish, Varun Tej movie news, Varun Tej movie details, Varun Tej news, Varun Tej mukunda news

Krish Varun Tej movie launch on feb 27th: Mega hero Varun Tej new movie under Krish Direction. Ramoji rao producer.

వరుణ్ సినిమాకు ముహూర్తం ఖరారు

Posted: 02/24/2015 10:47 AM IST
Krish varun tej movie launch on feb 27th

వరుణ్ తేజ హీరోగా ‘ముకుంద’ తర్వాత నటించబోయే రెండవ చిత్రం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వుండబోతుందని పూరీ ఇటీవలే ఓ పోస్టర్ విడుదల చేసాడు. కానీ ఇటీవలే ‘టెంపర్’ విడుదలయ్యి మంచి ఘనవిజయం సాధించడం... ఆ తర్వాత తాను ‘జ్యోతిలక్ష్మీ’ అనే సినిమా ఛార్మితో చేయబోతున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో వరుణ్ తీయబోయే సినిమా ఇప్పుడే లేదని అర్థమయ్యింది. అయితే పూరీ కంటే ముందుగా దర్శకుడు క్రిష్ పేరు వినిపించింది. ‘ముకుంద’ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తన రెండవ చిత్రం చేయనున్నాడని వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలే నిజం కానున్నాయి.

క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా నటించబోయే చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఫిబ్రవరి 27న ఘనంగా జరుగనున్నాయి. ఈ సినిమా మొత్తం 1940 టైంలో అనగా స్వాతంత్ర్యం రాక ముందునాటి కాలంలో జరుగుతుందని తెలిసింది. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని సమాచారం. ఈ సినిమాను నిర్మాత రామోజీరావు నిర్మించనున్నారని తెలిసింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

ప్రస్తుతం దర్శకుడు క్రిష్, ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రామోజీరావుతో కలిసి ‘దాగుడుమూత దండాకోర్’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్ తో క్రిష్ తీయబోయే సినిమాకు కూడా రామోజీరావు నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Director Krish  Puri Jagannadh  muhurtham  confirmed  Tollywood  Movie News  

Other Articles