Rakul preet singh liplock scenes condition tollywood latest updates

rakul preet singh latest news, rakul preet singh liplock scenes, rakul preet singh hot photos, rakul preet singh latest photos, rakul preet singh movies, rakul preet singh kick 2, rakul preet singh ram charan, rakul preet singh ntr, rakul preet singh mahesh babu, rakul preet singh photo gallery, rakul preet singh movie updates, rakul preet singh updates

rakul preet singh liplock scenes condition tollywood latest updates : Tollywood successful actress giving green signal to act in liplock scene. But only in one condition. To know about that please read full article.

‘లిప్ లాకా’..? అయితే ఓ కండీషన్!

Posted: 02/23/2015 05:47 PM IST
Rakul preet singh liplock scenes condition tollywood latest updates

ఇండస్ట్రీలో తారల మధ్య పోటీ ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యంలో లిప్ లాక్ వంటి ముద్దుసీన్లలోనూ, హాట్ సన్నివేవాల్లో నటించేందుకు అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతమున్న యంగ్ హీరోయిన్లైతే లిప్ లాక్ సీన్లలో నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని బహిరంగంగానే స్టేట్ మెంట్లు వెల్లడిస్తున్నారు. ఇలాంటి సీన్లలో నటించడం వల్ల వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ తోపాటు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ లభిస్తుందనే ఉద్దేశంతోనే ఒప్పుకుంటుంటారని విశ్లేషకుల అభిప్రాయం! ఇకపోతే.. తనకూ లిప్ లాక్ సీన్లలో నటించేందుకు అభ్యంతరం లేదని చెబుతున్న నటి రకుల్.. దానికితోడు ఓ చిన్న మెలిక పెట్టింది.

వరుస విజయాలతో తక్కువ సమయంలోనే అగ్రస్థానానికి దూసుకెళుతున్న పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్.. అధర చుంబనాలకు ఓకే అంటూ గ్రీన్ ఇస్తోంది. కానీ దానికితోడు ఓ చిన్న కండీషన్ పెడుతోంది. అదేమిటంటే.. ‘‘ఆ ముద్దు సన్నివేశం లేకపోతే ఆ సీన్ లేదు’’ అనిపించేంత సీరియస్ నెస్ ఆ సన్నివేశంలో వుండాలి. అలాంటప్పుడే తాను లిప్ లాక్ లో పాల్గొనడానికి అభ్యంతరం లేదంటూ తెలుపుతోంది. లేకపోతే చస్తే చేయనంటూ మొండికేస్తోంది. అంటే.. స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు లిప్ లాక్ ఖచ్చితంగా చేయాల్సి వస్తేనే తాను చేయడానికి ఓకే అంటోందన్నమాట! ఇదే విషయమై ఈ అమ్మడు తన అభిప్రాయాన్ని వెల్లడించింది కూడా!

‘‘సన్నివేశం సీరియస్ నెస్ మేరకు లిప్ లాక్ అవసరమైతేనే అందులో నటించేందుకు ఒప్పుకుంటాను. ఆ ముద్దు సీన్ లేకపోతే ఆ సీన్ లేదన్నట్లు అనిపించేంతగా సీరియస్ నెస్ వుండాలి. అలా అయితేనే ఓకే గానీ.. ఏదో అట్రాక్షన్ కోసమే, అదనపు గ్లామర్ కోసమో అంటే మాత్రం అస్సలు ఒప్పుకోను. నేను నటించే సినిమాలన్నీ నా తల్లిదండ్రులతో కూర్చుని చూసేలా వుండాలి. ఒకవేళ లిప్ లాక్ సీన్ వస్తే.. దాని ప్రత్యేకత గురించి వివరించేలా వుండాలి’’ అంటూ వెల్లడిస్తోంది రకుల్. అంటే.. ఫ్యామిలీతో కూర్చుని చూస్తున్నప్పుడు లిప్ లాక్ సన్నివేశాలోస్తే.. అప్పుడు ఆ సీన్ కి తగినట్లు దాని డిమాండ్ ఏంటో విశ్లేషించే విధంగా వుండాలంటూ కండీషన్ పెడుతోంది అమ్మడు!

ఇదిలావుండగా.. ప్రస్తుతం రవితేజతో ‘కిక్-2’ చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు.. త్వరలోనే రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, మహేష్ బాబులతో కలిసి నటించనుంది. అటు బాలీవుడ్ లో సైతం ఈ అమ్మడికి ఆఫర్లు వరుసగా వస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakul preet singh liplock  ram charan tej rakul  mahesh babu rakul  

Other Articles

  • Tollywood director boyapati srinu mother sitaravamma passes away

    దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

    Jan 17 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో... Read more

  • Famous telugu producer allu arvind to receive champion of change award

    అల్లువారింట క్రాంతి నింపిన సంక్రాంతి.. అరవింద్ కు అవార్డు..

    Jan 17 | అల వైకుంఠపురంలో ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ఆ వేడుకకు వచ్చిన ప్రేక్షకుల సాక్షిగా.. టీవీలలో చూస్తున్న వీక్షకుల సాక్షిగా తన కుమారుడు, సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు... Read more

  • Prabhas resumes shooting for jaan with pooja hegde

    ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

    Jan 17 | బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్... Read more

  • Man tries to kiss sara ali khan s hand actress left shocked

    యువరాణికి ముద్దపెట్టే యత్నం.. షాకైన నటి

    Jan 10 | అభిమానం హద్దులోనే వుంటే మంచిదని.. హద్దుమీరితే సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సివుంటుందని మరోమారు ఓ ఫ్యాన్ చేసిన అత్యుత్సాహం నిరూపించింది. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కు అనుభవం ఎదురుకావడంతో అమె షాక్ అయ్యారు. ‘కేదరనాథ్‌’... Read more

  • Kannada actress vijayalakshmi marries director anjanayya

    మిస్ అయిన హీరోయిన్.. మిస్సెస్ గా ప్రత్యక్షం..

    Jan 10 | కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో... Read more

Today on Telugu Wishesh