Rudhramadevi theatrical trailer delay

Rudhramadevi theatrical trailer Release Delay, Rudhramadevi trailer delay, Rudhramadevi theatrical trailer Release Date, rudramadevi teaser release date, rudramadevi teaser delay, rudramadevi teaser release, rudramadevi latest news, rudramadevi movie news, rudramadevi news, rudramadevi teaser, rudramadevi trailers, rudramadevi temper movie, rudramadevi, temper news

Rudhramadevi theatrical trailer Release Delay: Anushka upcoming movie Rudramadevi. Rudramadevi first look teaser release Delay.

ట్రైలర్ ఆగిపోయింది.... క్షమించమంటున్నరుద్రమదేవి

Posted: 02/14/2015 10:12 AM IST
Rudhramadevi theatrical trailer delay

అనుష్క, రానా, అల్లు అర్జున్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘రుద్రమదేవి’ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను ఈ నెల 17వ తేదిన మహాశివరాత్రి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదల మరికాస్త ఆలస్యం అయ్యేలా వుందని చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది.

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. భారీ బడ్జెట్ తో, ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. గోనగన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించారు.

దురదృష్టవశాత్తు ఈ చిత్ర ట్రైలర్ కు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదని, ట్రైలర్ కోసం మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందేనని తెలిపారు. ట్రైలర్ విడుదల ఆలస్యం అవుతున్నందుకు క్షమించాలని, అన్ని పనులు పూర్తయ్యాక త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చిత్రయూనిట్ తెలియజేసారు.

ఇందులో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారగణం ముఖ్య పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మార్చి నెల చివర్లో ‘రుద్రమదేవి’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudhramadevi  theatrical trailer  Delay  Release Date  Anushka  Gunashekhar  telugu  news  

Other Articles