Ram charan special guest in meelo evaru koteeswarudu

Ram Charan Special Guest MEK, Ram Charan in Meelo Evaru Koteeswarudu, Ram Charan in MEK, Ram Charan mek, Ram Charan latest news, Ram Charan movie news, Ram Charan mek videos, Ram Charan mek updates, Ram Charan latest issue, Ram Charan news, Ram Charan in trouble, Ram Charan movie details, Ram Charan songs, Ram Charan

Ram Charan Special Guest In Meelo Evaru Koteeswarudu: Ram Charan Special Guest In Nagarjuna`s Meelo Evaru Koteeswarudu Program. Nagarjuna`s Meelo Evaru Koteeswarudu Program running very good.

కింగ్ కోటీశ్వరుడులో గోవిందుడి స్పెషల్ ఎంట్రీ

Posted: 02/10/2015 10:34 AM IST
Ram charan special guest in meelo evaru koteeswarudu

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్న కూడా చరణ్ ఇంకా తన కొత్త సినిమాను ప్రారంభించలేదు. ఈ వేసవి సెలవుల్లో చరణ్ సినిమా విడుదలవుతుందని భావించిన అభిమానులు భారీగా నిరాశ చెందారు. ఆ అభిమానుల కోసం రాంచరణ్ బుల్లితెరపై స్పెషల్ ఎంట్రీ ఇస్తున్నాడు.

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ఇటీవలే మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకొని, ఇటీవలే రెండవ సీజన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.  ఈ రెండవ సీజన్ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా... మరి అతిగా చేయకుండా... నాగార్జున చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాడు.

ఈ కార్యక్రమంలో మాములు వ్యక్తులతో పాటుగా సెలబ్రెటీలు కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అనుష్క, శ్రియ, రకూల్ ప్రీత్ సింగ్, నితిన్, సందీప్ కిషన్, మంచు లక్ష్మీ, కాజల్, విశాల్, శ్రియ, విద్యాబాలన్... వంటి సెలబ్రెటీలు ఏదో సరదగా ఈ కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తెస్తున్నారు.

అయితే తాజాగా ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రాంచరణ్ రాబోతున్నాడు. ఇటీవలే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఈ వారమే ప్రసారం కానుంది. ఇప్పటివరకు సినిమాల్లో తన నటన, డాన్స్, ఫైట్స్ లతో ఆకట్టుకున్న చరణ్... ఇపుడు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో ఎలా ఆడనున్నాడోనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Meelo Evaru Koteeswarudu  Nagarjuna  Movies  News  

Other Articles