Ram chanran polica case party

ramcharan, case on ram charan, ram charan party, chiranjeevi son

ram chanran polica case party : police file a case on hero ram charan. on yester day chanran gave a party to his friends and those people shout.

రామ్ చరణ్ పై పోలీస్ కేసు నమోదు !

Posted: 02/09/2015 10:05 AM IST
Ram chanran polica case party

సినీనటుడు రామ్ చరణ్ తేజపై కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.25లో నివసించే రామ్‌చరణ్‌ నివాసంలో ఆదివారం తెల్లవారు జాము వరకు తన స్నేహితులతో కలసి పార్టీ చేసుకున్నారు. ఇందులో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కొడుకు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు, మరో ఇద్దరు స్నేహితులు కూడా పాల్గొన్నారు.

పార్టీ సందర్భంగా వారు గట్టి అరుస్తూ కేకలు వేశారంటూ, పక్కింటిలో ఉంటున్న ఐపిఎస్ అదికారి గౌతం సవాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దాంతో జూబ్లిహిల్స్ పోలీసులు వచ్చి పార్టీని ఆపాలని కోరగా, అందుకు రామ్ చరణ్ తేజ నిరాకరించినట్లు సమాచారం. దాంతో ఆయనపై జూబ్లీభిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramcharan  case on ram charan  ram charan party  chiranjeevi son  

Other Articles