Renu desai comments on relationship with pawan kalyan

Renu desai comments on relationship, Renu desai comments on Pawan kalyan, Renu desai tweets on relationship, Renu desai tweets on Pawan kalyan, Renu desai tweets, Renu desai latest tweets, Renu desai latest news, Renu desai comments on pawan kalyan, Renu desai latest updates, Renu desai pawan kalyan, Renu desai

Renu desai comments on relationship with Pawan kalyan: Renu desai latest tweets about her relationship with pawan kalyan and her childrens. The actress tweeted, "I felt that it was a more emotional moment for a ... a very good relationship with Pawan Kalyan even after their divorce.

ప్రతిరోజు కళ్యాణ్ తో మాట్లాడుతాను: రేణు దేశాయ్

Posted: 02/04/2015 11:06 AM IST
Renu desai comments on relationship with pawan kalyan

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కూతురు ఆధ్య... తాను చదువుతున్న స్కూల్ కల్చరల్ ఈవెంట్ లో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే ఈ విషయంపై రేణు... ‘కూతురు ఎదుగుదల చూస్తుంటే గర్వంగా ఉంది. అదొక ఎమోషనల్ మూమెంట్. ఈ భావన తల్లిగా నా కంటే తండ్రికి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది మాటల్లో చెప్పలేనిది’ అంటూ ట్వీట్ చేసింది.

ఈ విషయం సరిగ్గా అర్థం చేసుకొని కొంతమంది పవన్ యాంటీ ఫ్యాన్స్... పవన్ మంచి తండ్రికాదంటూ విమర్శలు చేసారు. ఇందుకు సమాధానంగా రేణు వారి విమర్శలకు ఘాటుగా స్పందించింది. ఈ గొడవ ఇంతటితో ముగిసిపోయింది. అయితే తాజాగా మరోసారి పవన్ కు, తనకు వున్న అనుబంధాన్ని గురించి రేణు ఓ క్లారిటీ ఇచ్చేసింది.

తాను కళ్యాన్ భార్యభర్తలుగా విడిపోయినప్పటికీ, పిల్లలకు తల్లితండ్రులుగా మాత్రం ఇప్పటికి కలిసే వున్నామని, ప్రతిరోజు ఫోనులో మాట్లాడుకుంటామని అన్నారు. ఇద్దరు పిల్లలు ఆధ్య, అకిరా నందన్ లకు తల్లితండ్రులుగా తాము, తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ తన జీవితంలో ఏం జరుగుతున్నాయో ప్రతి విషయం కళ్యాణ్ కు తెలుసేనని, తాము మంచి స్నేహితులుగా కలిసే వున్నామని రేణు చెప్పుకొచ్చింది.

రేణు, పవన్ ల మధ్య వున్న అనుబంధంపై ఎవరైనా అనుమానపడే వారికి ఓ క్లారిటీ ఇచ్చినట్లుగా అయ్యింది. మొత్తానికి విడాకులతో కాస్త దూరమైన కూడా.. పిల్లల ద్వారా ఇంకా మంచి స్నేహితులుగా, పిల్లలకు మంచి తల్లితండ్రులుగా వుంటున్నారని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా వీరి గురించి వార్తలు ఆగుతాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Renu desai  Tweets  Comment  Relationship  Movie News  Tollywood  

Other Articles