Rakul preet singh kick2 pandaga chesko simla mirchi movies shooting three states

rakul preet singh news, rakul preet singh latest news, rakul preet singh kick 2 movie, rakul preet singh simla mirchi movie, rakul preet singh pandaga chesko movie, rakul preet singh hot photo shoot, rakul preet singh ravi teja, rakul preet singh ram, rakul preet singh gallery, rakul preet singh bikini photos

rakul preet singh kick2 pandaga chesko simla mirchi movies shooting three states : rakul preet singh is migrating at a time in three states because of her movies shooting schedules.

షూటింగుల సాకుతో చక్కర్లు కొడుతున్న ప్రీత్

Posted: 01/29/2015 06:30 PM IST
Rakul preet singh kick2 pandaga chesko simla mirchi movies shooting three states

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి చిత్రంతోనే రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్’గా పేరు సాధించింది. ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ వరుసగా విజయాలు సాధించడంతో ఈమెకు క్రేజ్ బాగానే పెరిగిపోయింది. దీంతో ఈ అమ్మడికి ఒక్కొక్కటిగా ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా రకుల్ ప్రీత్ తెలుగు రెండు, హిందీలో ఒక చిత్రంతో ఫుల్ బిజీగా వుంది. ఈ మూడు మూవీల షూటింగులు కంటిన్యూగా ఒకేసారి జరుగుతుండటంతో ఒక్కరోజు ఖాళీగా లేకుండా గడుపుతోంది. ఇదే సమయంలో ఆ యూడు చిత్రాల క్లైమాక్సుల చిత్రీకరణ ఒకేసారి వుండటంతో వాటికోసం మూడురాష్ట్రాలు తిరుగుతోందట. దీని గురించి స్వయంగా రకుల్ ప్రీత్ ఎంతో ఎగ్జైటింగ్ చెబుతోంది.

‘‘ఎప్పుడూ లేనివిధంగా ఈసారి చాలా విచిత్రం చోటు చేసుకుంది. ఒకేసారి మూడు సినిమాలు క్లైమాక్సుకి వచ్చేశాయి. ‘కిక్-2’ మూవీ క్లైమాక్స్ కోసం జైసల్మాన్ వెళ్ళాల్సి వచ్చింది. అది పూర్తయ్యాక ‘సిమ్లా మిర్చి’ అనే హిందీ సినిమా క్లైమాక్స్ కోసం ముంబయ్ వెళ్లాను. అది కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు ‘పండగ చేస్కో’ కోసం రాజమండ్రి దగ్గరలోని సామర్లకోటకు వెళుతున్నాను’’ అని సంతోషంగా వెల్లడించింది.

ఇలా ఈ విధంగా చిత్రాల షూటింగుల సాకుతో ఈ అమ్మడు మూడు రాష్ట్రాల్లో బాగానే చక్కర్లు కొడుతోందన్నమాట! అన్నట్టు ఈమెకు క్రేజ్ రానురాను పెరిగిపోతుండటంతో రెమ్యునరేషన్’ను పెంచేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ భామ 50 లక్షలు దాకా తీసుకుంటోంది. మరి.. ఇంకెంత పెంచుతుందో?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakul preet singh movies  kick 2 movie updates  pandaga chesko updates  

Other Articles