ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే కమెడియన్’గా ప్రత్యేక గుర్తింపు సాధించిన సప్తగిరికి ప్రస్తుతం దశ తిరిగినట్లు కనిపిస్తోంది. ‘ప్రేమకథా చిత్రం’, ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ వంటి సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ బుల్లెట్టు.. సప్త నుంచి ఒక అడుగు మేర తగ్గి దూసుకుపోవడానికి సిద్ధంగా వున్నాడు. ఇటువంటి మార్పులు కేవలం కొంతమంది కెరీర్’లోనే సాధ్యపడుతాయి. అందులో ఇప్పుడు ఈ సప్తగిరి కూడా చేరిపోయాడు.
ఇటీవలి కాలంలో కొన్ని సినిమాల్లో నటించి కమెడియన్’గా పేరు తెచ్చుకుంటున్న కొందరు హీరోలుగా అవతారం ఎత్తుతున్నారు. ప్రస్తుతం కమెడియన్లుగా చెలామణి అవుతున్న కొత్తవాళ్లందరూ ఆ జాబితాలో వున్నవారే! ఇప్పుడు తాజాగా వీరిలో సప్తగిరి కూడా చేరిపోయాడు. చిన్నసినిమాల్లో వరుసగా నటిస్తూ తన కామెడీ ట్రాక్’తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఈ కమెడియన్ ఇప్పుడు హీరోగా మారుతున్నట్లు సమాచారం!
ప్రముఖ ఈవెంట్ మేనేజ్’మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా ఇతనిని హీరోగా తీసుకుని ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీకి ‘ఆరడుగుల బుల్లెట్టు’ అనే టైటిల్’ను పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే.. ఇది ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి వుంది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more