Bollywood celebrities sonakshi sinha deepika padukone tamil star hero vijay latest movie news

ilayatalapati vijay news, ilayatalapati vijay movie news, sonakshi sinha news, deepika padukone news, sonakshi sinha hot photos, sonakshi sinha hot photo shoot, deepika padukone hot photo shoot, nayanatara news

bollywood celebrities sonakshi sinha deepika padukone tamil star hero vijay latest movie news : tamil super star vijay suggested to his latest movie producers to take any bollywood actress as heroine.

బాలీవుడ్ భామకోసం కోట్లు ఖర్చుచేస్తున్న తమిళ హీరో!

Posted: 01/24/2015 04:55 PM IST
Bollywood celebrities sonakshi sinha deepika padukone tamil star hero vijay latest movie news

కోలీవుడ్’లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ స్టార్ హీరో బాలీవుడ్ భామలపై మనసు పారేసుకున్నాడట! దక్షిణాదిన ఎంతో మంది హీరోయిన్లు అతని కోసం వెయిటింగ్ లిస్టులో వున్నప్పటికీ.. అతను మాత్రం ఉత్తరాదిన వున్న తారల మీదే దృష్టి సారించాడు. పైగా ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికైనా ఈ హీరో వెనుకాడటం లేదు. ఇంతకీ ఆ హీరో ఎవరు..? అని అనుకుంటున్నారా..? మరెవరో కాదు ఇళయదళపతి విజయ్!

అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం విజయ్ ‘పులి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలో వుండగానే తన తదుపరి చిత్రానికి అప్పుడే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఆ మూవీ తర్వాత ఈ హీరో అట్లీకుమార్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకారం తెలిపాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీకోసం హీరోయిన్’ను వెతికే పనిలో బృంగం నిమగ్నమైంది. మొదట్లో నయనతారను కథానాయికగా ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఆ అమ్మడు డేట్స్ ఖాళీలేవంటూ తేల్చి చెప్పేసిందిట! దీంతో మరో తారకోసం తమ సెర్చింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

అయితే.. విజయ్ మాత్రం తన తదుపరి చిత్రంకోసం బాలీవుడ్ కథానాయికను ఎంపిక చేసుకోవాల్సిందిగా నిర్మాతలకు చెప్పాడట! ఎంత ఖర్చయినా.. బాలీవుడ్ ముద్దుగుమ్మనే తీసుకోమంటూ సలహాలు ఇచ్చాడట! దీంతో ఆ మూవీ నిర్మాతలు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లుగా పేరొందిన దీపిక పదుకొనె లేదా సోనాక్షి సిన్హా ఇద్దరిలో ఎవరినో ఒకరిని కథానాయికగా తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారట! ఇలా ఈ విధంగా విజయ్ మొండికేయడంతో నిర్మాతలకు కోట్ల రూపాయల ఖర్చు కానుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles