Tollywood hero ram latest movie title shivam director srinivas reddy

hero ram latest movie, hero ram shivam movie, ram shivam movie news, ram srinivas reddy movie news, hero ram gossips, hero ram movies, mahesh babu news, mahesh babu latest movie news, mahesh babu heroines, mahesh babu shivam movie

tollywood hero ram latest movie title shivam director srinivas reddy : After pandaga chesko movie.. Hero ram will busy in his latest movie which is directed by new director sinivas reddy. For this movie they decided shivam title which is already fix to mahesh.

మహేష్’కి దక్కాల్సింది రామ్ చెంతకు చేరింది..!

Posted: 01/20/2015 11:22 AM IST
Tollywood hero ram latest movie title shivam director srinivas reddy

ఈమధ్యకాలంలో ఇండస్ట్రీలో కొన్ని అనుకోని విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికో దక్కాల్సిన వ్యవహారాలు ఇంకొకరి చేతికి చిక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడో ప్రిన్స్ మహేష్ బాబుకు దక్కాల్సిన ఓ టైటిల్.. ఇప్పుడు రామ్ చెంతకు విచిత్రంగా చేరిపోయింది.

క్రిష్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘శివం’ అనే టైటిల్’తో ఓ చిత్రం రూపొందబోతోందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! అప్పుడు ఆ మూవీకి సంబంధించిన కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి కూడా! ఇక కొన్నిరోజుల్లోనే సెట్స్’పైకి వెళుతుందని అనుకున్న సమయంలో కొన్ని అనివార్య కారణాలవల్ల మొదట్లోనే ఆగిపోయింది. మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో టాక్ వచ్చింది కానీ.. అలా ఏమీ జరగలేదు. ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన సమస్యల వల్ల ఆ మూవీ అర్థంతరంగా ఆగిపోయింది. అంతేకాదు.. డేట్స్, హీరోయిన్, పాత్రల సర్దుబాటు ఇలా అన్ని విషయాల్లో లోపాలు వుండటంతో ఆ మూవీని ఆపేశారు.

ఇదిలావుండగా.. మహేష్-క్రిష్ కాంబోలో రావాల్సిన ఆ చిత్రానికి పెట్టిన ‘శివం’ టైటిల్ ఇప్పుడు హీరో రామ్ చెంతకు చేరిపోయింది. కొత్త దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రామ్ ఓ మూవీ చేయడానికి అంగీకరించాడు. ఈ మూవీ కోసం మొదట్లో చాలా టైటిళ్లను పరిశీలించిన అనంతరం చివరికి ‘శివం’ను పెడుతున్నట్లు సమాచారం! దాదాపుగా అదే టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశం వుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రామ్ ‘పండగ చేస్కో’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే.. ‘శివం’ షూటింగ్’లో పాల్గొంటాడు. ఇంకా ఈ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu hero ram shivam movie  mahesh babu movies  telugu news  

Other Articles