Goa beauty ileana dating tips for lovers

goa beauty ileana news, ileana dcruz, ileana dcruz photo shoot, ileana latest news, ileana hot photo shoot, ileana dating tips, ileana affairs, ileana dating, ileana sexy photos

goa beauty ileana dating tips for lovers : actress ileana giving some beautiful dating tips to lovers to enjoy themselves with happily

డేటింగ్’కి దుప్పటి తీసుకెళ్తే.. ఆ మజాయే వేరట!

Posted: 01/19/2015 05:51 PM IST
Goa beauty ileana dating tips for lovers

ఈమధ్య గోవాబ్యూటీ ఇలియానా కొన్ని సెక్సీ కాంట్రోవర్సీ కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచిపోతున్న విషయం తెలిసిందే! ఆమధ్య ‘బ్రా’ గురించి తన అభిప్రాయాలను వెల్లడించి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు.. తర్వాత బాయ్’ఫ్రెండ్’తో శారీరక సుఖం పొందడంలో ఎంతో ఆనందం వుందంటూ వ్యాఖ్యానించింది. ఇప్పుడు తాజాగా డేటింగ్ గురించి తనదైన టిప్స్ యూత్’కి అందిస్తోంది ఈ సన్నజాజి నడుముభామ!

విదేశీయులు ప్రారంభించిన ఈ డేటింగ్ విధానం.. ఇప్పుడు భారత్’లోనూ కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఇదే విషయమై మాట్లాడిన ఇల్లీ.. డేటింగ్’పై వున్న తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘‘డేటింగ్ అనేది ఓ విదేశీ సంప్రదాయం అయినా మెల్లమెల్లగా ఇక్కడివాళ్లు దానికి అలవాటు పడుతున్నారు. డేటింగ్ చేయడం నాకూ ఇష్టమే’’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే తాను ఎవరితో డేటింగ్ చేస్తుందోనన్న విషయాన్ని వ్యక్తపరచకుండా ఓ చిరునవ్వు నవ్వేసి ఎస్కేప్ అయింది.

అంతేకాదు.. డేటింగ్’కి సంబంధించి కొన్ని టిప్స్ కూడా ఇస్తోంది ఈ అమ్మడు! ‘డేటింగ్’కి వెళ్లాలనుకునేవాళ్లు ముందుగానే ఓ మాంచి ప్లాన్ వేసుకోవాలి. ముఖ్యంగా చల్లని ప్రదేశాల్లో డేటింగ్ చేస్తే అక్కడ మజాయే వేగుగా వుంటుంది. ఆ చల్లని వాతావరణంలో చిన్న క్యాంప్ ఫైర్ వేసుకుని చలి కాచుకుంటూ ఎంచక్కా కబుర్లాడుకోవచ్చు. అలాగే తమతోపాటు రుచికరమైన తినుబండారాలతో ఓ పిక్నిక్ బాస్కెట్’ను నింపుకుని తీసుకెళ్లాలి. అలాగే.. ఏ చోటు బాగుందనిపిస్తే అక్కడ హాయిగా కూర్చుని.. ఓ దుప్పటి కప్పుకుని కాసేపు సేద తీర్చుకోవాలి’’.

‘‘అలాగే డేటింగ్’కి బీచ్’కన్నా బెస్ట్ ప్లేస్ ఏది వుండదు. బీచ్’కి దగ్గరలోని ఇసుకలో పడుకుని, ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ కబుర్లు చెప్పుకుంటుంటే.. భలే మజాగా వుంటుంది. వైన్ కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాలి. వైన్ సిప్ చేస్తూ మాటలు పంచుకుంటే.. మనసులు ఇంకా దగ్గరవుతాయి’’ అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. తాను ఇంతవరకు ఎవరితో డేటింగ్ చేసిందో, ఎవరితో మనసు కలిపిందోనన్న విషయాలను మాత్రం చెప్పలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ileana dating tips  telugu heroines hot photo shoots  tollywood affairs  

Other Articles