Allu arjun final decision on liplock scenes

allu arjun latest news, allu arjun interview, allu arjun twitter, allu arjun movies, allu arjun liplock scenes, allu arjun kissing scenes, shahrukh khan latest news, shahrukh khan news, shahrukh khan liplock scenes

allu arjun final decision on liplock scenes : the stylish star allu arjun said that he will never do liplock scenes in his latest movies.

‘లిప్ లాక్’ సీన్లపై అల్లు చివరి నిర్ణయం!

Posted: 01/19/2015 12:35 PM IST
Allu arjun final decision on liplock scenes

ప్రస్తుతం వస్తున్న చిన్న సినిమాల నుంచి పెద్ద మూవీలన్నింటిలోనూ ‘లిప్ లాక్’ సన్నివేశాలు వుండటం చాలా కామన్ అయిపోయాయి. ఒకప్పుడు టాలీవుడ్’లో ఇవి చాలా అరుదుగా వుండేవి కానీ.. నేడు పెచ్చుమీరిపోయాయి. చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరూ నటీనటులు పోటాపోటీగా ఎగబడిమరీ ముద్దాడుకుంటున్నారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తాను నటించిన కొన్ని మూవీల్లో ‘లిప్ లాక్’ సీన్లను బాగానే పండించాడు. ఇప్పుడు అదే వ్యవహారంపై స్పందించిన ఈ నటుడు.. ఆ ముద్దు సన్నివేశాలపై తన చివరి నిర్ణయాన్ని ప్రకటించాడు.

ఇకపై తాను నటించే సినిమాల్లో తారలతో ‘లిప్ లాక్’ సీన్లలో నటించనంటూ స్పష్టం చేశాడు. ఎందుకంటే.. తన చిత్రాలను చాలావరకు ఫ్యామిలీ ఆడియెన్సే ఎక్కువ చూస్తారని, అలాంటి సమయంలో మూవీమధ్యలో లిప్ లాక్ సీన్లు వస్తే వాళ్లు ఇబ్బందికరంగా ఫీల్ అవుతారనే భావనతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయమై అతడు మాట్లాడుతూ.. ‘‘నేను పెళ్లి చేసుకోక ముందునుంచే లిప్ లాక్ సన్నివేశాలకు వ్యతిరేకంగానే వున్నాను. కానీ స్ర్కిప్టు డిమాండ్ చేయడంతో కొన్ని చిత్రాల్లో తప్పక చేయాల్సి వచ్చింది. అందుకే, నేను రిజెక్ట్ చేయలేకపోయాను’’.

‘‘ఇప్పటివరకు నేను నటించిన సినిమాలన్నింటినీ ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతగానో సపోర్ట్ చేశారు. కానీ.. ముద్దు సీన్లు వచ్చినప్పుడు వాళ్లు ఇబ్బందలు ఎదుర్కొని వుండవచ్చు. ఎందుకంటే.. నేను నా ఫ్యామిలీతో కూర్చుని సదరు సన్నివేశాలు చూసినప్పుడు ఇబ్బందిగానే ఫీల్ అయ్యాను. అందుకే.. ఇకనుంచి లిప్ లాక్ సీన్లలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నా’’ అని విశ్లేషించాడు. అలాగే.. ‘‘రొమాంటిక్ హీరో అంటే ఖచ్చితంగా ముద్దు సీన్లు చేయాల్సిన అవసరం లేదు. అందుకు ఉదాహరణగా షారుఖ్ ఖాన్’నే తీసుకోవచ్చు. ఎందుకంటే.. రొమాంటిక్ హీరోగా పేరొందిన ఆయన.. ఇంతవరకు తాను నటించిన సినిమాల్లో ఒక్క ముద్దు సీన్ కూడా చేయలేదు’’ అని పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles