Allu arjun trivikram srinivas movie title husharu

Husharu movie, Husharu telugu movie, Allu Arjun Husharu movie, Allu Arjun, Allu Arjun latest movie, Allu Arjun latest movie title, Allu Arjun latest updates, Allu Arjun wallpapers, Allu Arjun next movie, Allu Arjun Trvikram Srinivas movie, Husharu movie cast and crew, tollywood updates, upcoming telugu movies

Allu Arjun Trivikram Srinivas Movie title Husharu : Stylish Star Allu Arjun Trivikram Srinivas upcoming movie name titled as Husharu. Allu Arjun movie going to complete in February.. after post production works movie will release in summer

‘జులాయి’ ఎలా ఉంటాడో తెలుసుగా... !

Posted: 01/19/2015 08:43 AM IST
Allu arjun trivikram srinivas movie title husharu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘జులాయి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగానే సమాచారం ఉంది తప్ప... ఫస్ట్ లుక్, టీజర్లు, ట్రైలర్లు వంటి ప్రమోషన్  విడుదల కాలేదు. తాజాగా సినిమా టైటిల్ పై మాత్రం ఫిలింనగర్ లో ఓ టాక్ విన్పస్తోంది. లేటెస్ట్ మూవీకి ‘హుషారు’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

గతంలో ‘త్రిశూలం’ అనే టైటిల్ అనుకోగా.., చివరకు ‘హుషారు’ను ఫైనలైజ్ చేసినట్లు మూవీ యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ వెడ్డింగ్ కాంట్రాక్టర్ గా కన్పించనున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే నెలలో షూటింగ్ పూర్తి చేసి ఎండాకాలంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ గా పేరుపొందిన బన్నీ ఈ మూవీ కోసం ప్రత్యేకంగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

బన్నీ లేటెస్ట్ మూవీలో సమంత, అదాశర్మ, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు కన్నడ సూపర్  స్టార్ ఉపేంద్ర, ప్రముఖ నటి స్నేహ ప్రత్యేక పాత్రల్లో కన్పించనున్నారు. వీరిపై ఇప్పటికే షూటింగ్ పూర్తి చేశారు. డివివి దానయ్య సమర్పణలో హారిని&హారిక క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా., రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun latest  Trivikram Srinivas movies  Husharu movie  

Other Articles