Allu arjun gona gannareddy making video rudramadevi movie

allu arjun latest news, gona gannreddy news, rudramadevi movie news, rudramadevi making videos, rudramadevi gona gannareddy

allu arjun gona gannareddy making video rudramadevi movie : the making video of allu arjun's gona gannareddy role on sankranti festival

‘గుణ’గన్నారెడ్డిని ఇలా తయారుచేశారు...

Posted: 01/15/2015 04:42 PM IST
Allu arjun gona gannareddy making video rudramadevi movie

దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’. ఇందులో అనుష్క మెయిన్ రోల్’లో నటిస్తుండగా.. దగ్గుబాటి రానా నిడదవోలు చాళుక్యరాజుగా నటిస్తున్నాడు. ఇక అల్లుఅర్జున్ కూడా గోనగన్నారెడ్డి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించి రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. ప్రేక్షకుల నుంచి వాటికి అనూహ్య స్పందన లభించింది కూడా! తాజాగా సంక్రాంతి కానుకగా అల్లుఅర్జున్ పాత్రకు సంబంధించినంతవరకు మేకింగ్ వీడియోను ఆ మూవీ యూనిట్ విడుదల చేసింది.

ఈ సినిమాలో సూపర్ వారియర్ లుక్’తో ప్రేక్షకుల ముందుకొస్తున్న అల్లుఅర్జున్’ని అలా తయారుచేసేందుకు యూనిట్ సభ్యులు చాలానే కష్టపడ్డారు. ముఖ్యంగా దర్శకుడు గుణ చాలానే కష్టపడినట్లు తెలుస్తోంది. ప్రతిఒక్క అంశంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు గుణ.. గోనగన్నారెడ్డి పాత్రకోసం ప్రత్యేక శ్రధ్ద తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేకింగ్ వీడియోలో అర్జున్ తన పాత్రకు న్యాయం చేసేందుకు ఎంత కష్టపడ్డాడో తెలుసుకోవచ్చు. భారీ యాక్షన్ సన్నివేశాలను సైతం ఈ హీరో చేస్తున్నట్లు చూడొచ్చు. దాదాపు 40 రోజులవరకు తన పాత్రకోసం షూటింగ్’లో పాల్గొన్నాడు అర్జున్! ఈ వీడియోను చూస్తేనే తెలిసిపోతుంది.. థియేటర్లలో ఖచ్చితంగా అర్జున్ పాత్రకు అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించడం ఖాయం!

ఇక దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్నే తన ప్రపంచంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఆయన తెరకెక్కించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీగా బోల్తాకొట్టడంతో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమవ్వాల్సి వచ్చింది. అయితే తిరిగి తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ ప్రాజెక్ట్’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఖర్చును ఏమాత్రం లెక్కచేయకుండా దాదాపు ఏడాదిన్నర నుంచి షూటింగ్’లో బిజీగా వున్న గుణ.. ప్రతిఒక్క పాత్ర విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ మేకింగ్ వీడియోలోనూ ఆయన కష్టాన్ని వీక్షించవచ్చు. స్వయంగా తానే నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న గుణ.. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun gona gannareddy  rudrama devi making videos  

Other Articles