Daggubati rana bollywood baby movie promotion talks about bahubali movie

daggubati rana latest news, daggubati rana bahubali, daggubati rana baby movie, bollywood baby movie news, daggubati rana physic, rana latest photo shoot, daggubati rana body build up, daggubati rana speech, bahubali movie, rudramadevi movie news

daggubati rana bollywood baby movie promotion talks about bahubali movie : In the bollywood movie baby promotional event actor daggubati rana has told that he got bahubali movie offer only with his physic

అందువల్లే ‘బేబీ’ రానాకు ఆ ఆఫర్ వచ్చిందట!

Posted: 01/12/2015 11:55 AM IST
Daggubati rana bollywood baby movie promotion talks about bahubali movie

దగ్గుబాటి రానా.. టాలీవుడ్’లో వున్న ఆరడుగుల డైనమిక్ నటుల్లో ఒకడు! భారీ ఫిజిక్ వున్నప్పటికీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మొదటిరోజుల్లో రానాకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ‘లీడర్’ ఒక్కటే యావరేజ్ హిట్’గా నిలవగా.. మిగతావన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడినవే! బాలీవుడ్’లో కూడా కొన్ని సినిమాల్లో నటించాడుగానీ.. అక్కడ కూడా అంతగా ఇమేజ్ దక్కలేదు. దీంతో ఇతను కొన్నాళ్లపాటు మూవీలకు గ్యాప్ పాటించాడు. అనంతరం ఇప్పుడు భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’, ‘రుద్రమదేవీ’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. దీంతోపాటు హిందీలో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బేబీ’ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ప్రస్తుతం ‘బేబీ’ మూవీ ప్రమోషన్’లో ఫుల్ బిజీగా వున్న రానా.. తాజాగా ఓ ఈవెంట్’లో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తన ఫిజిక్ వల్లే ‘బాహుబలి’లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో అవకాశం వచ్చిందని ఈ నటుడు చెప్పుకొచ్చాడు. ‘నా ఫిజిక్, కండలు తిరిగిన బాడీ వల్లే ‘బాహుబలి’ మూవీలో పనిచేసే అవకాశం దక్కింది’ అని రానా తెలిపాడు. అంతేకాదు.. ఈ చిత్రం కోసం తాను ఎంతగానో కష్టపడ్డాడని.. ముఖ్యంగా బాడీ బిల్డప్ చేయడంలో ఎంతో శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. పాత్రకు తగ్గట్టు ఫిజిక్’ను మెయింటేయిన్ చేయాల్సి వుంటుంది కాబట్టి.. నిత్యం ఎక్సర్’సైజ్ చేయాల్సి వచ్చేందని చెప్పాడు.

అలాగే ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ పార్ట్’కి షూటింగ్ పూర్తి చేశాను. ప్రస్తుతం సెకండ్ పార్ట్’కి షూటింగ్ చేస్తున్నాను. ఇప్పటికే సెకండ్ పార్ట్’కి 60% షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ టఫ్ ప్రాజెక్ట్’కి 120కి పైగా కాల్షీట్స్ ఇచ్చాను’ అని పేర్కొన్నాడు. ఇదిలావుండగా.. రానా నీరజ్ పాండే దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ బేబీలో నటించాడు. ఈ సినిమా జనవరి 23న రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : daggubati rana physic  bahubali movie news  bollywood baby movie  

Other Articles