Gemini tv owns temper movie rights for big price

Temper movie release date, Temper movie shooting updates, Temper movie photos, Temper movie wallpapers, Temper movie latest, Temper movie satellite, gemini owns temper movie rights, Gemini TV, Ntr movie, Ntr upcoming movies, tollywood Updates, Upcoming telugu movies

Gemini Tv owns Temper Movie Rights for Big price : Gemini tv boughts Temper movie Satellite rights for big price. Temper movie shooting talkie part comes to end soon. NTR latest movie audio release on 18th January

ఫేటు మారకున్నా రేటు బాగానే పలికింది

Posted: 01/10/2015 05:01 PM IST
Gemini tv owns temper movie rights for big price

ఎన్టీఆర్ సినిమాలు వరుసగా ఫ్లాపులవుతున్నా ఆయనకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. ఎప్పటికైనా హిట్ తగలకపోతుందా అని ఫ్యాన్స్ అంతా ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘టెంపర్’ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. జనవరి 1న వచ్చిన టీజర్ ఈ అంచనాలను మరింత పెంచేస్తోంది. సినిమా భారీ రేంజ్ లో ఉంటుందని అంతా చెప్తున్నారు. యంగ్ టైగర్ కు ఇది సరైన హిట్ ఇచ్చే సినిమాగా చెప్తున్నారు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., ఈ సినిమా శాటిలైట్ హక్కులను ‘జెమినీ టీవీ’ దక్కించుకుందట. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ‘టెంపర్’ కోసం రూ.7.75కోట్లు చెల్లించి హక్కులు సొంతం చేసుకుందని టాక్ విన్పిస్తోంది. కేవలం టీజర్ చూసి ఈ స్థాయిలో రేటు పెట్టారంటే సినిమా బాగానే ఉంటుందని టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం టాకీ పార్ట్ చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఆడియో రిలీజ్ విషయానికి వస్తే సంక్రాంతి తర్వాత జనవరి 18కి మూవీ ఆడియో విడుదల కానుంది.

పరమేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాను పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘ఆంధ్రావాలా’ ఫ్లాపు తర్వాత పూరీ-ఎన్టీఆర్ కాంబినేషన్ పదేళ్లు గ్యాపు తీసుకుని మళ్లీ సినిమా తీస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తారక్ పోలిస్ ఆఫీసర్ గా కన్పించనున్నాడు. ఈ మూవీ తర్వాత నందమూరి హీరో సుకుమార్ తో సినిమా చేసేందుకు రెడిగా ఉన్నాడు. సంక్రాంతి తర్వాత ప్రి ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసి వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభిస్తారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Temper movie  NTR  Gemini TV  

Other Articles