Nora fatehi temper telugu movie first look item song director puri jagannath junior ntr kajal agarwal

nora fatehi, nora fatehi hot photos, nora fatehi hot photo shoot, junior ntr news, kajal agarwal news, junior ntr temper news, nora fatehi temper movie

nora fatehi temper telugu movie first look item song director puri jagannath junior ntr kajal agarwal : nora fatehi first look revealed from temper movie.

ఫస్ట్’లుక్’తో ‘టెంపర్’ ఎక్కించేస్తోందిగా...

Posted: 01/06/2015 11:43 AM IST
Nora fatehi temper telugu movie first look item song director puri jagannath junior ntr kajal agarwal

దర్శకుడు పూరీజగన్నాథ్ తెరకెక్కించే ప్రతిచిత్రంలోనూ ఆడియెన్స్’ను హీటెక్కించే హాట్ ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా వుంటుందనే విషయం తెలిసిందే! అంతేకాదు.. ఆయా పాటలకు అతగాడు సరికొత్త సెక్సీ భామలకు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు. ఇలా పూరీ ఇప్పటివరకు ఎంతోమంది హాట్ తారలను తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయించాడు. ఇప్పుడు తాజాగా మరో హాట్ బొమ్మను ‘టెంపర్’ మూవీ ద్వారా పరిచయం చేయబోతున్నాడు.

కెనెడియన్ మోడల్ అయిన నోరా ఫతేహీ టెంపర్ చిత్రంలో ఐటమ్ సాంగ్’లో నృత్యించనుంది. చాలాకాలం క్రితమే ఈమె పూరీ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆ పాటకు సంబంధించి ఆమె ఫోటోగానీ, ఇతర వివరాలుగానీ అంతగా తెలియరాలేదు. తాజాగా ఆమె ఫస్ట్’లుక్ విడుదలయ్యింది. ప్రస్తుతమిది నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటోంది. తానే స్వయంగా సెల్ఫీ ఫోటో తీసుకుని సోషల్ నెట్’వర్కింగ్ సైట్’లలో అప్’లోడ్ చేసింది.

nora-fatehi-1

చీరలో తన హాట్’లుక్స్’ను ప్రదర్శించిన ఈ బొమ్మ.. బాలీవుడ్’లో రోర్ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో అమ్మడు బాగానే అందాలు పొగేసినప్పటికీ.. ఆఫర్లు మాత్రం కరువయ్యాయి. దీంతో ఇప్పుడు ఐటమ్ సాంగ్’తో టాలీవుడ్’లో తన మంత్రజాలాన్ని పర్చాలనే ఉద్దేశ్యంతో వుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్’గా నటిస్తున్న విషయం తెలిసిందే! శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని.. త్వరలోనే విడుదల చేసే ప్లాన్’లో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nora fatehi temper movie  junior ntr news  kajal agarwal news  

Other Articles