I movie censor problems

I movie release problems, I Movie censor problems, I Movie latest updates, I Movie release dates, I Movie latest photos, I Movie wallpapers, I Movie trailer, I Movie latest updates, pongal movies, telugu movies for sankranti, 2015 sankranti telugu movies

I movie censor problems : shankar I movie shooting and production works also completed but because of censor problems movie release getting late. censor board given u/a for I movie shankar wants u certificate for tax exemption so that he appealed in delhi censor board

‘ఐ’ని ఆలస్యం చేస్తున్న శంకర్.. డైరెక్టరే విడుదలకు అడ్డంకి..?

Posted: 01/05/2015 04:06 PM IST
I movie censor problems

దేశం మొత్తాన్ని ఉవ్విళ్లూరిస్తున్న ‘ఐ’ సినిమా వాయిదాల పర్వంగా నిలుస్తోంది. ఎప్పుడో దీపావళికి వస్తుందనుకున్న ఈ మూవీ గతేడాది ఎలాగూ రాలేదు. దీంతో సంక్రాంతికి తప్పకుండా వస్తుందని భావించారు. అంతా అనుకున్నట్లే సంక్రాంతి విడుదల అంటూ తెగ ఊదరగొట్టేస్తోంది. ‘ఐ విల్ సీ యు ఆన్ సంక్రాంతి’ అంటూ అన్ని భాషల్లోని ట్రైలర్లలోనూ విక్రమ్ చెప్తున్నాడు. సంక్రాంతి పండగకు మరో పది రోజులే సమయం ఉంది. అయినా సరే విడుదల తేదిపై మాత్రం ఇంకా స్పష్టత వీడలేదు ఇదంతా చూస్తుంటే పండగకైనా విడుదల అవుతుందా లేక.., మరో నెల వాయిదా పడుతుందా అని ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయింది.

అప్పుడంటే సినిమా పనులు పూర్తి కాకపోవటం వల్ల ఆలస్యం జరిగింది. కానీ ఇప్పుడేమయింది అని ప్రశ్నిస్తే.., శంకర్ అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని ’యు/ఎ’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాకు సెన్సారే అడ్డుగా నిలుస్తోందట. ‘ఐ’ మూవీకి శంకర్ ‘యు’ సర్టిఫికెట్ కోరుకుంటున్నాడు. క్లీన్ ‘యు’ అయితే సినిమాపై ట్యాక్స్ ఉండదు. దాదాపు 180 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తీసిన ఈ ప్రాజెక్టు ఎంత డబ్బు వసూలు చేస్తుందో ఊహించలేము. కాబట్టి ఆ స్థాయిలో వచ్చే ధన ప్రవాహానికి పన్ను కట్టాలంటే డైరెక్టర్ కు మనసొప్పటం లేదట.

అందుకే క్లీన్ ‘యు’ కోసం చెన్నై తర్వాత ముంబై సెన్సార్ బోర్డుకు వెళ్లాడు. అక్కడ కూడా పెద్ద తేడా ఏమి లేకపోవటంతో ఏకంగా ఢిల్లీలో ఉన్న సెంట్రల్ బోర్డుకు వెళ్ళాడు. సెంట్రల్ సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికెట్ ఇస్తుందేమో అని ఆశతో ఎదురుచూస్తున్నాడు. ఢిల్లీ బోర్డు సినిమా చూసి, రిజల్ట్ చెప్పేందుకు సమయం ఉండటంతో, రిలీజ్ డేట్ ను ప్రకటించలేకపోతున్నారట. దేశం గర్వించదగ్గ సినిమాలు తీసే ఇలాంటి డైరెక్టర్ దేశంకోసం పన్ను కట్టకుండా తప్పించుకునేందుకు తంటాలు పడటం సిగ్గు చేటని విమర్శలు వస్తున్నాయి. అయితే మేము కూడా బతకాలి కదా.., ఉన్నదంతా సర్కారుకు కట్టేస్తే మళ్ళీ సినిమా ఎలా తీయాలి అని నిర్మాతల సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎవరి వాదనలు వారు విన్పిస్తున్నా సెన్సార్ బోర్డు ఏమంటుందా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఢిల్లీ బోర్డు కూడా క్లీన్ ‘యు’ ఇవ్వలేమంటే క్రియేటర్ ఏం చేస్తాడో...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : I Movie  censor board  sankranti movies  

Other Articles