Ntr latest photo in temper movie

Temper movie, Temper photos, Temper latest, Temper latest photos, Temper latest updates, Temper shooting photos, Ntr photos in Temper, ntr latest photos in Temper, Jr Ntr latest photos, Jr Ntr latest updates, Jr Ntr upcoming movies, Puri Jagannath movies, Puri Jagannath upcoming movies, Upcoming Telugu Movies, Temper audio songs, Temper songs release, Temper reelase date, Temper cast and crew

Ntr latest photo in Temper movie : Temper movie unit releases NTR latest photo of movie in shooting spot. Temper new look show ntr serious role in movie and also reveals movie leval. Temper movie shooting last schedule going to complete in time. temper making fastly to relaase on february 05 2015 and audio of movie will released directly

మూవీ గురించి చెప్పడానికి ఇది చాలు

Posted: 12/29/2014 12:07 PM IST
Ntr latest photo in temper movie

అన్నం ఉడికిందా లేదా చూడాలంటే.., ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. అలాగే ‘టెంపర్’ హిట్ అవుతుందా కాదా అంటే లేటెస్ట్ ఫొటో చూస్తే తెలిసిపోతుంది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. తాజాగా విడుదల అయిన ఫొటోను చూసి నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు. షూటింగ్ స్పాట్ లో ఉండగా ఓ సీన్ కు సంబంధించి తీసిన ఫోటోను పూరీ జగన్నాధ్ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. ఈ స్టిల్ చూసిన అభిమానులు సీరియస్ పోలిస్ ఆఫీసర్ స్టోరీ.., సూపర్ హిట్ అని కామెంట్లు చేస్తున్నారు.

‘టెంపర్’ చివరి షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతోంది. ఈ నెల 27న ప్రారంభమైన పది రోజుల షూటింగ్ సంక్రాంతి నాటికి పూర్తవుతుందని అంటున్నారు. పండగ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశ పనులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 5న విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ ‘పటాస్’లాగే ఈ సినిమా ఆడియోను కూడా డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేస్తారని టాక్ విన్పిస్తోంది. దీనిపై మూవీ యూనిట్ ప్రకటన చేయాల్సి ఉంది. బండ్ల గణేష్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పలు కారణాలతో సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

అనేక మలుపులు తిరిగిన సినిమా షూటింగ్ ఇప్పట్లో ఉండదు అనుకున్నారంతా. అయితే లేట్ అయితే బాగోదు అని భావించి.., వెంటనే షూటింగ్ మొదలు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫిబ్రవరి 5న సినిమాను విడుదల చేస్తామని అంటున్నారు. ‘రభస’ ఫ్లాప్ తర్వాత జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేస్తున్న తారక్.., భారీ ఆశలే పెట్టుకున్నాడు. వక్కంతం కథ, పూరీ డైరెక్షన్ కలిసి వస్తుందని నమ్ముతున్నాడు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందనేది సినిమా విడుదల అయితే తెలియనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Temper movie  Jr NTR  Tollywood latest  

Other Articles