Amitabh bachan overcome tb disease

amitabh bachan tb, amitabh bachan suffers tb disease, amitabh bachan health problems, amitabh bachan twitter facebook page, amitabh bachan shamitabh movie, amitabh bachan latest updates, tb disease treatment, dangerous diseases, bollywood latest news updates

amitabh bachan overcome tb disease : bollywood big b amitabh bachan reveales a shocking news to fans world on sunday that he suffered from tb before 2ooo but fortunately he overcome the disease with proper treatment

అంత కష్టమొచ్చినా కడుపులోనే దాచుకున్నావా..!

Posted: 12/22/2014 01:38 PM IST
Amitabh bachan overcome tb disease

కష్టాలు, బాధలు పంచుకుంటే తీరతాయి అంటారు. కానీ కొన్ని సార్లు ఎవరితోనూ పంచుకోకుండా ఉంటేనే ఉత్తమంగా ఉంటాయి. అందుకే అనుకుంటా ఎంత ఇబ్బంది పడ్డా కూడా తనకున్న వ్యాధి గురించి అమితాబ్ బయటకు చెప్పలేదు. అనుకోని పరిస్థితిలో సమయం కలిసి రావటంతో విషయాన్ని బయటకు కక్కారు. ప్రపంచ వ్యాప్తంగా తనుకున్న అభిమానులను షాక్ కు గురిచేస్తూ తనను ఒకప్పుడు వేధించిన వ్యాధి గురించి చెప్పారు. దీంతో అభిమాన లోకం నివ్వెరపోయింది. ఎంత ఇబ్బంది వచ్చినా బయటకు చెప్పలేదే అని బాదపడుతోంది.

ముంబైలో ఆదివారం రోజు టీబీ(క్షయ)పై అవగాహనా కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న బిగ్ బీ.., మాటల్లో భాగంగా తానూ ఈ వ్యాధి బాధితుడినే అన్నారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమం కోసం ఆరోగ్య పరీక్షలు చేయగా.., టీబీ ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో అప్రమత్తమై.., వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకున్నట్లు చెప్పారు. సకాలంలో చికిత్స తీసుకోవటం వల్ల తాను ఈ వ్యాధి నుంచి బయట పడ్డానని అమితాబ్ బచ్చన్ వెల్లడించారు.

తాజా ప్రకటనతో అమితాబ్ ఆరోగ్యంపై అనుమానాలు వస్తున్నాయి. అనారోగ్యం వల్లే ఈ మద్య ఎక్కువగా సినిమాల్లో నటించటం లేదని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి ఊహాగానాలు వస్తాయనే గతంలో టీబీ గురించి బయటకు చెప్పలేదని సన్నిహితులు అంటున్నారు. బిగ్ బి నటించిన లేటెస్ట్ మూవీ ‘షమితాబ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో కమల్ రెండవ కూతురు అక్షర హాసన్ హీరో్యిన్ గా పరిచయం అవుతోంది. బాల్కీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే తెలుగులో కూడా విడుదల కానుంది.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitabh bachan latest  tb disease  shamitabh updates  

Other Articles