Puri jagannath son akash debut movie shooting started

puri jagannath son movie, puri jagannath son akash movie, puri akash debut movie name, puri akash debut movie latest updates, puri akash latest updates, andhra pori movie updates, andhra pori movie cast and crew, ulka singh latest movie updates, puri jagannath latest updates

puri jagannath son akash debut movie shooting started : puri jagannath son akash started his debut movie pooja cermony completed in prasad lab on 18th december, puri akash will seen in andhra pori movie as his first movie opposite with ulka gupta

టాలీవుడ్ కు కొత్త హీరో ఎంట్రీ.. వెరైటీ టైటిల్ తో వస్తున్న ఆకాశ్

Posted: 12/18/2014 12:45 PM IST
Puri jagannath son akash debut movie shooting started

టాలీవుడ్ లో మరో కొత్త హీరో ఎంట్రీ ఇచ్చాడు. విభన్నమైన కథనాలతో సినిమాలు తీసే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు. గతంలో ప్రకటించిన ప్రకారం.., మరాఠీ మూవీ ‘టైమ్ పాస్’ తెలుగు రీమేక్ తో ఆకాశ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు గురువారం జరిగాయి. ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పూరి జగన్నాథ్ కుటుంబ సభ్యులతో పాటు, రమేష్ ప్రసాద్, సాయి, రాజు ముదిరాజు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

2015 జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పూరీ తనయుడి తొలి సినిమాకు ‘ఆంధ్రా పోరీ’ అనే పేరు పెట్టారు. టైటిల్ ను బట్టే.., సినిమా మాస్ ను ఆకట్టుకునేలా మార్పులు చేసి తెరకెక్కిస్తారని తెలుస్తోంది. రాజు ముదిరాజు దర్శకత్వంలో ఆకాశ్ తొలి సినిమా రానుంది. ఈ ప్రాజెక్టులో ఉల్కా గుప్తాను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆకాశ్ సినిమా కార్యక్రమాలు మొదలు కావటంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పూరీ తనయుడికి శుభాకాంక్షలు తెలపటంతో పాటు.., మంచి హీరోగా రాణించాలని ఆశీర్వదిస్తున్నారు. ‘తెలుగు విశేష్’ కూడా పూరీ ఆకాశ్ టాప్ హీరో స్థాయికి ఎదగాలని కోరుకుంటోంది.

చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న పూరీ ఆకాష్ బాల నటుడుగా చాలా సినిమాల్లో కన్పించాడు. ఆ సమయంలో పూరీ తనయుడుగా కేవలం కొద్ది మందికే తెలుసు. ధోనీ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేసినా.., అది కూడా పిల్లల నేపథ్యంగా వచ్చిన సినిమా కావటంతో ‘ఆంధ్రా పోరీ’నే తొలి మూవీగా భావించాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : puri akash debut  andhra pori movie  puri jagannath latest updates  

Other Articles