Akkineni akhil debut movie shooting started

akkineni akhil movie shooting, akkineni akhil first movie heroine, akkineni akhil movie latest updates, akkineni akhil vv vinayak movie title, vv vinayak latest movie updates, naga chaitanya latest movie updates, nithin on akhil movie, chinnadana neekosam movie updates, nagarjuna karthi movie updates, tollywood latest news updates

akkineni akhil debut movie shooting started : all awaited akkineni akhil debut movie shooting started on 17th december with few people presence. akhil says his first movie shooting started and will not wait more time asks fans to bless him

సీక్రెట్ గా మొదలెట్టేశాడు క్షమించమంటూ మెసేజ్ పెట్టాడు

Posted: 12/17/2014 10:28 AM IST
Akkineni akhil debut movie shooting started

అక్కినేని నట వారసుడిగా క్రేజ్ సంపాదించుకున్న అఖిల్ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. శుభవార్త వినాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే అఖిల్ మాత్రం చాలా సింపుల్ గా, సీక్రెట్ గా షూటింగ్ మొదలు పెట్టేశాడు. బుధవారం ఉదయం కేవలం కొద్ది మంది సమక్షంలో సినిమా మూహూర్తం షాట్ తీశారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మద్య సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

‘గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయను, వివి వినాయక్ తో హీరోగా పరిచయం అవుతున్న సినిమా పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. డార్లింగ్ ప్రొడ్యూసర్ నితిన్ మరియు సుధాకర్ రెడ్డికి ఆల్ ది బెస్ట్. వారితో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు ఆలస్యం అయినందుకు నన్ను క్షమించండి’ అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు. ముహూర్తం షాట్ మొదలు పెట్టడంతో ఇక త్వరలోనే సినిమా షూటింగ్ వేగం పుంజుకుంటుందని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.

ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్న నితిన్ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. సినిమా నిర్మించే అవకాశం ఇఛ్చిన నాగార్జునకు ధన్యవాదాలు తెలిపిన ‘చిన్నదాన నీకోసం’ హీరో.., ఫ్యాన్స్ సహకారం అవసరమని కోరారు. వచ్చే ఏడాది వేసవి టార్గెట్ గా ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే మూవీలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటివరకు ఫిలిం యూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles