Sridevi tamil movie remuneration

sridevi koliwood movie, sridevi remuneration, sridevi latest movies, sridevi movie updates, tollywood latest updates, sridevi telugu movies, sridevi tamil movies, koliwood latest updates, heros and heroines remunerations

sridevi tamil movie remuneration : top actress sridevi acting slowly in her second innings because of her remuneration, presently sridevi acting in koliwood movie, she demands more than all leading actress presently in the industry

వయసు ముదిరే కొద్దీ.., రేటు పెంచుతోంది

Posted: 12/15/2014 12:28 PM IST
Sridevi tamil movie remuneration

అతిలోక సుందరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ చాలా స్లోగా సాగుతోంది. ఆఫర్లు ఇస్తామని తీసుకొచ్చినా.., ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసిందో మనకు తెలియంది కాదు. పాపులర్ హీరోయిన్, ఇప్పటికీ ప్రజల్లో క్రేజు ఉండీ ఎక్కువ సినిమాల్లో నటించలేకపోతోంది. ఇందుకు గల కారణాలేమిటంటే.., రెమ్యునరేషన్ అసలు విషయం అని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. సినిమాలకు కోట్లు డిమాండ్ చేస్తుండటంతో ముదురు హీరోయిన్ కు అంత డబ్బు పెట్టాలా...? అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

‘ఇంగ్లీష్ వింగ్లీష్’ తర్వాత శ్రీదేవి సినిమాలు చేయలేదు. అయితే తాజాగా ఓ తమిళ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నటించేందుకు ఏకంగా రూ.5కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట. దీన్నిబట్టే సినిమాలు ఎందుకు రావటం లేదో అర్థం చేసుకోవచ్చు. సౌత్ లో టాప్ హీరోయిన్లుగా ఉన్న అనుష్క, సమంత, శృతి హాసన్ కూడా ఇంతగా డిమాండ్ చేయటం లేదు. అలాంటిది వయసు ముదిరేకొద్దీ రేటు పెంచుకుంటూ పోతుందని గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఇలా ఒక హీరోయిన్ ను అది కూడా... ప్రస్తుతం గ్లామర్ షో చేయలేని నటిని పెట్టి రూ. 5కోట్లు చెల్లించటమంటే కష్టం. అందుకే టాలీవుడ్ వర్గాలు అమ్మడితో సినిమాలు చేసేందుకు ఎక్కువగా ముందుకు రావటం లేదు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sridevi movie  sridevi remuneration  tollywood latest updates  

Other Articles